శ్రీలంక పేలుళ్లు: ఉన్నతాధికారులపై వేటు

| Edited By:

Apr 25, 2019 | 1:03 PM

శ్రీలంకలో జరిగిన అతి భయంకర మారణహోమం నేపథ్యంలో ఆ దేశ రక్షణ కార్యదర్శి, ఐజీలపై వేటు వేశారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. వెంటనే వారు వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. పేలుళ్ల గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. వాటిని నివారించడంలో వారిద్దరు విఫలమైనందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సిరిసేన సలహాదారు షిరల్ లక్‌తిలక ధ్రువీకరించారు. కాగా వరుస పేలుళ్ల తరువాత మంగళవారం సిరిసేన మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి […]

శ్రీలంక పేలుళ్లు: ఉన్నతాధికారులపై వేటు
Follow us on

శ్రీలంకలో జరిగిన అతి భయంకర మారణహోమం నేపథ్యంలో ఆ దేశ రక్షణ కార్యదర్శి, ఐజీలపై వేటు వేశారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. వెంటనే వారు వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. పేలుళ్ల గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. వాటిని నివారించడంలో వారిద్దరు విఫలమైనందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సిరిసేన సలహాదారు షిరల్ లక్‌తిలక ధ్రువీకరించారు.

కాగా వరుస పేలుళ్ల తరువాత మంగళవారం సిరిసేన మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నిఘా వర్గాల సమాచారం ఉన్నప్పటికీ.. రక్షణ అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో 24గంటల్లో రక్షణ విభాగంలోని ఉన్నత పదవుల్లో మార్పులు ఉంటాయని తెలిపిన ఆయన.. రక్షణ కార్యదర్శి, ఐజీలపై వేటు వేశారు. కాగా శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఐజీని విధుల నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉండదు.