శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 24మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారణకాండకు పాల్పడినవారు ఒకే ముఠాకు చెందిన వారని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. కాగా నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) ముఠా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వారు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే 2018లో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసి ఎన్టీజే తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిలో 295మంది మరణించగా.. సుమారు 500మంది గాయపడ్డారు.