Birds Hospital: అక్కడ పక్షులకూ ఓ స్పెషల్ హాస్పిటల్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Birds Hospital: తమిళనాడులోని కోయంబత్తూర్ అంటే ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పొచ్చు..పైగా పశ్చిమకనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో పాటు

Birds Hospital: అక్కడ పక్షులకూ ఓ స్పెషల్ హాస్పిటల్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Birds Hospital

Updated on: Nov 08, 2021 | 9:54 AM

Birds Hospital: తమిళనాడులోని కోయంబత్తూర్ అంటే ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పొచ్చు..పైగా పశ్చిమకనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో పాటు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పక్షులు వలస వస్తుంటాయి. అయితే ఇటీవల కాలుష్య కోరలు, మనుషులు వాడి పడేసిన వస్తువులు వాటికి హాని చేస్తున్నాయి. తరచూ పదుల సంఖ్యలో పక్షులు గాయాలపాలవుతున్నాయి. అందుకే అక్కడి అటవీ సిబ్బంది వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.

ఇక్కడ కేవలం మనుషుల చేతిలోనే గాక.. తోడేళ్లు, ఇతర జంతువుల దాడిలో గాయపడిన పక్షులను ఈ కేంద్రానికి తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు. వారానికోసారి వైద్యుడు వచ్చి గాయపడిన పక్షులను పరిశీలిస్తారు. అవి పూర్తిగా కోలుకున్న తరువాత తిరిగి అడవిలో వదిలేస్తారు. ఈ మధ్యే సూళ్లూరు ప్రాంతంలో గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుదైన ఈజిప్ట్​ మాంసాహార డేగను ఈ కేంద్రానికి తీసుకొచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ‘రెక్కకు అయిన గాయం కారణంగా ఎగరలేకపోయిన ఆ డేగకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు’ వివరించారు.

పక్షుల చికిత్స కోసం ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో.. ఎక్స్ రే, శస్త్రచికిత్స వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేగాక తల్లి లేక గుడ్డు నుంచి బయటకొచ్చే కోడిపిల్లలను రక్షించేందుకు ఇంక్యుబేటర్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు, అడవిలో చనిపోయిన పక్షులను దహనం చేసేందుకు మూడు నెలల క్రితం గ్యాస్ ఆధారిత శ్మశానవాటికనూ ఇక్కడ నిర్మించారు. తమిళనాడులో ఇలాంటిది మొదటిది కావడం విశేషం. ఇప్పటివరకు 40కి పైగా పక్షుల మృతదేహాలను ఈ శ్మశానవాటికలో దహనం చేశారు. అటవీ శాఖ సిబ్బంది స్వచ్ఛంద సంస్థ చొరవను పక్షి ప్రేమికులు అభినందిస్తున్నారు. పక్షులను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.