Space Fuel Station: అంతరిక్షంలో పెట్రోలు బంకులు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాసా.. స్పేస్‌ సంస్థ ప్రయోగాలు

|

Nov 26, 2021 | 6:29 PM

Space Fuel Station: అంబరానికి భూమికి మధ్య అంతరాన్ని తగ్గించేశాడు నేటి మానవుడు. అంతరిక్షంలోకి సరదాగా వెళ్లి వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ భూములు కొంటూ తమకు..

Space Fuel Station: అంతరిక్షంలో పెట్రోలు బంకులు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాసా.. స్పేస్‌ సంస్థ ప్రయోగాలు
Space Fuel Station
Follow us on

Space Fuel Station: అంబరానికి భూమికి మధ్య అంతరాన్ని తగ్గించేశాడు నేటి మానవుడు. అంతరిక్షంలోకి సరదాగా వెళ్లి వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ భూములు కొంటూ తమకు ఇష్టమైనవారికి గిఫ్ట్ ఇచ్చేవారి గురించి తరచుగా వింటూనే ఉన్నాం అయితే ఇప్పుడు అంతరిక్షంలోనూ పెట్రోలు బంకులు ఏర్పాటు కానున్నాయి. మానవులు భూమిపై ఎలా అయితే వాహనాల్లో పెట్రోలు, డీజిల్‌ కొట్టించుకుని ప్రయాణిస్తున్నారో.. ఇకపై స్పేస్‌లో కూడా ఇంధనం ఆధారంతో ప్రయాణించబోతున్నాడు. కొంత కాలంగా స్పేస్‌లో దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్యా అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్ష పేరుతో తన సొంత శాటిలైట్‌ను పేల్చేసింది. దీంతో శాటిలైట్‌కు సంబంధించిన 1500 కు పైగా ఉపగ్రహ శకలాలు భూ కక్ష్యలో తిరుగుతున్నాయి. రష్యా మతిలేని చర్యల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బంది ప్రాణ భయంతో ఐఎస్ఎస్ క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఇలా శాటిలైట్లను పేల్చడంతో పాటు ఇతర శకలాల వల్ల ఉపగ్రహాలకు నష్టం వాటిల్లనుంది. అందుకే పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు..ఆ శకలాలను ఉపగ్రహాలపై నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన న్యూమన్‌ స్పేస్‌ సంస్థ ‘ఇన్‌ స్పేస్‌ ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌’ పేరుతో కాలం చెల్లిన ఉగప్రహాల శకలాలు, రాకెట్ల విడిబాగాలతో అంతరిక్షంలో థ్రస్ట్‌ పుట్టుకొచ్చేలా ప్రయోగాలు ప్రారంభించింది. అంతరిక్షంలో రాకెట్లు ముందుకు ప్రయాణించడానికి ఈ థ్రస్ట్‌ ఉపయోగపడుతుంది. థ్రస్ట్‌ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలా థస్ట్‌ రావాలంటే ఇంధనం అవసరం అవుతుంది. అందుకే స్పేస్‌లోనే శకలాలతో ఇంధనం తయారు చేయనున్నారు. ఒకరకంగా ఇది అంతరిక్షంలో పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేయడంలాంటిదే. భవిష్యత్‌ అవసరాలకోసం నాసా ప్రయోగాలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో న్యూమన్‌ స్పేస్‌ సంస్థ ప్రయోగాలు చేస్తుంది.

Also Read:  చించినాడ బ్రిడ్జ్ సేఫ్.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు