Guinness World Records 2022: టీ తయారీతో గిన్నిస్‌ రికార్డ్‌..! గంటలో 249 కప్పుల టీ తయారు చేసింది.. రికార్డు కొట్టింది..

|

Oct 20, 2022 | 12:47 PM

ఇంటికి ఎవరైనా బంధవులు వచ్చినప్పుడు మర్యాదకోసం వారికి ముందుగా టీ చేసి ఇస్తాం. అయితే.. అదే టీ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేయొచ్చని మీకు తెలుసా? ఒక్క గంటలోనే ఎక్కువ కప్పుల టీ చేసి ఈ ప్రపంచ రికార్డును సాధించారు ఓ మహిళ...

Guinness World Records 2022: టీ తయారీతో గిన్నిస్‌ రికార్డ్‌..! గంటలో 249 కప్పుల టీ తయారు చేసింది.. రికార్డు కొట్టింది..
South African woman makes 249 cups of tea in one hour
Follow us on

ఇంటికి ఎవరైనా బంధవులు వచ్చినప్పుడు మర్యాదకోసం వారికి ముందుగా టీ చేసి ఇస్తాం. అయితే.. అదే టీ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేయొచ్చని మీకు తెలుసా? ఒక్క గంటలోనే ఎక్కువ కప్పుల టీ చేసి ఈ ప్రపంచ రికార్డును సాధించారు ఓ మహిళ. దక్షిణాఫ్రికాలోని వుప్పెర్థల్‌ ప్రాంతానికి చెందిన ఇంగర్‌ వలెంటైన్‌ అనే మహిళ ఈ అరుదైన రికార్డును సాధించారు. తమ దేశంలో పర్యాటక, ట్రావెల్‌ రంగాలను బలోపేతం చేయాలని భావించిన ఆ మహిళ, స్థానికంగా ఎంతో ఫేమస్‌ అయిన ‘రూయ్‌బోస్‌’ అనే టీని తయారు చేసే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఇంగర్‌ వలెంటైన్‌ మూడు రకాల రుచులు వెనిల్లా, స్ట్రాబెర్రీ, ఒరిజినల్‌ టీని ఉపయోగించి టీ తయారు చేయాలి. ఈ రికార్డు సాధించేందుకు గంట సమయంలో 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది. ఇందులో ఓ మెలిక కూడా ఉంది. ఒకే పాత్రను ఉపయోగించాలి, కేవలం కొన్ని కప్పులు మాత్రమే వాడాలి.

దీంతో ఆ మహిళ ఓ స్ట్రాటజీని వాడారు.. పాత్రలో ఒకేసారి నాలుగు టీ బ్యాగులు వేసి రెండు నిమిషాల పాటు వాటిని కరిగించారు. దానిని నాలుగు కప్పుల్లో పోశారు. ఆ తర్వాత మళ్లీ రిపీట్‌ చేశారు. ఆమెకు స్థానిక విద్యార్థులు సాయంగా నిలిచారు. చేసిన టీ చేసినట్లు తాగుతూ కప్పులు కడిగి మళ్లీ ఇంగర్‌కు అందించే వారు. ఇలా ఒక్క గంట సమయంలోనే 249 కప్పుల టీని తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ లెక్కన ఆమె నిమిషానికి 4 కప్పుల టీ తయారుచేసినట్లు తెలుస్తుంది.