Aeroplane: విమానంలో విలాసవంతమైన బిజినెస్‌ క్లాస్‌లో కనిపించిన అనుకోని అతిధి.. ఒక్కసారిగా ప్రయాణికుల గగ్గోలు..

విమానంలోకి ఓ పాము ప్రవేశించడంతో ప్రయాణికులంతా భయందోళనలకు గురయ్యారు. సోమవారం (అక్టోబర్‌ 17) ఫ్లోరిడాలోని టంపా నుంచి న్యూజెర్సీకి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-2038 విమానం బిజినెస్ క్లాస్‌లో..

Aeroplane: విమానంలో విలాసవంతమైన బిజినెస్‌ క్లాస్‌లో కనిపించిన అనుకోని అతిధి.. ఒక్కసారిగా ప్రయాణికుల గగ్గోలు..
Snake In Us Plane

Updated on: Oct 19, 2022 | 1:18 PM

విమానంలోకి ఓ పాము ప్రవేశించడంతో ప్రయాణికులంతా భయందోళనలకు గురయ్యారు. సోమవారం (అక్టోబర్‌ 17) ఫ్లోరిడాలోని టంపా నుంచి న్యూజెర్సీకి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-2038 విమానం బిజినెస్ క్లాస్‌లో పాము కనిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. న్యూజెర్సీలో ల్యాండ్‌ అయిన తర్వాత పోర్ట్ అథారిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ దానిని సురక్షితంగా అడవిలో విడచి పెట్టినట్లు ఎయిర్‌లైన్ సిబ్బంది మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. విమానంలో ప్రవేశించిన పాము కామన్‌ గ్రేటర్‌ స్నేక్‌గా గుర్తించారు. ఇవి విషపూరితమైనవి కాదని, ఇది ఫ్లోరిడాలో విస్తృతంగా కనిపిస్తాయని, మనుషులపై ఇవి దాడిచేయవని వన్యప్రాణి నిపుణులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదని ఎయిర్‌లైన్ వెల్లడించింది.

విమానాల్లో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మలేషియాలోని ఎయిర్‌ ఏషియా విమానం గాల్లో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడికి పైన ఉన్న లైట్‌లో పాము కనిపించింది. దీనికి సంబంధించిన టిక్‌టాక్‌ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఇక 2016లో ఎయిర్‌ మెక్సికో విమానంలో గ్రీన్‌ వైపర్‌ జాతికి చెందిన పాము విమానం రెక్కపై కనిపించింది.