Jerusalem Jail : అచ్చంగా చిరంజీవి ‘వేట’ సినిమాలాగే.. చెంచాలతో సొరంగం తవ్వి జైల్‌ నుంచి ఎస్కేప్‌. ఎక్కడంటే..

|

Sep 07, 2021 | 3:06 PM

Jerusalem Jail: చిరంజీవి హీరోగా నటించిన 'వేట' సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో హీరోను అండమాన్‌లోని ఓ జైల్లో వేస్తారు. అక్కడ హీరోకు ఓ వృద్ధుడు పరిచయం అవుతాడు. అత్యంత..

Jerusalem Jail : అచ్చంగా చిరంజీవి వేట సినిమాలాగే.. చెంచాలతో సొరంగం తవ్వి జైల్‌ నుంచి ఎస్కేప్‌. ఎక్కడంటే..
Follow us on

Jerusalem Jail: చిరంజీవి హీరోగా నటించిన ‘వేట’ సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో హీరోను అండమాన్‌లోని ఓ జైల్లో వేస్తారు. అక్కడ హీరోకు ఓ వృద్ధుడు పరిచయం అవుతాడు. అత్యంత దుర్భేధ్యమైన ఆ జైల్‌ నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న వస్తువులతో అతను ఓ సొరంగాన్ని తవ్వేందుకు ప్రయత్నిస్తాడు. సినిమాటిక్‌ ఫీల్‌ కోసం దర్శకుడు అలా తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఇదే సీన్‌ రియల్‌ లైఫ్‌లోనూ జరిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన గిల్బోవా అనే జైల్‌ నుంచి చెంచాల సహాయంతో సొరంగం తవ్వి ఆరుగురు ఖైదీలు తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్‌లో ఉన్న గిల్బోవా అనే జైలు అత్యంత భద్రతా ప్రమాణాలు ఉండే జైలు. ఈ జైల్‌లోని ఓ సెల్‌లోనే ఇస్లామిక్‌ జిహాద్‌కు చెందిన ఐదురురితో పాటు అల్‌ అక్సా మార్టిర్స్‌ బ్రిగేడ్‌ నాయకుడు గత కొన్నేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు. వీరిలో నలుగురు జీవత ఖైదును అనుభవిస్తున్నారు. పాలస్తీనాకు చెందిన వీరంతా జైల్‌ నుంచి తప్పించుకోవడానికి పక్కా ప్లాన్‌ వేశారు. సెల్‌లో ఉన్న ఓ సింక్‌ను ఆధారంగా చేసుకొని జైలు బయట వరకు భారీ సొరంగాన్ని తవ్వారు. ఇందుకోసం వారు కేవలం ఓ చెంచాను ఉపయోగించడం గమనార్హం. జైల్‌ నుంచి బయటపడ్డ వారు పంట పొలాల నుంచి పరిగెడుతూ పారిపోయారని స్థానిక రైతులు చెబుతున్నారు.

ఈ సంఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తప్పించుకుపోయిన ఖైదీల కోసం భద్రతా బలగాలు పెద్ద ఎత్తు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ జైల్‌లో 400 మంది ఖైదీలను అధికారులు వెంటనే మరో జైల్‌కు మార్చేశారు. ఖైదీలు జైలులో తవ్విన సొరంగాన్ని సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read:  Telangana Rains: తెలంగాణలోని 20 జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు.. అక్కడే ఉండాలంటూ ఆదేశాలు

Bank alert! ఇలా చేయకుంటే మీ ఎస్‌బీఐతో సహా ఇతర బ్యాంక్ సేవలు నిలిచిపోయే అవకాశం..! ఎందుకో తెలుసా?

Michael: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ది వైర్ ఫేమ్ మైఖేల్ విలియమ్స్ మృతి.. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లేనా ?