
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులు మోతతో దద్దరిల్లింది. మిసిసిపీలోని టేట్ కౌంటీలో గుర్తు తెలియని వ్యక్తి.. తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. అర్కబుట్ల రోడ్డులోని ఓ షాప్‌లో చొరబడిన దుండగుడు.. ఈ కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇద్దరు చనిపోగా.. అక్కడే ఉన్న ఇంట్లోకి వెళ్లిన ఉన్మాది అక్కడ ఇద్దరిని కాల్చి చంపాడు. మరో ఇద్దరిని అర్కబుట్ల డ్యామ్ వద్ద కాల్చేశాడు. వరుస కాల్పుల్లో మొత్తం ఆరుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకున్నారు. నిందితుడిని గుర్తించారు. అతను కారులో పారిపోతుండగా పట్టుకున్నారు.
కాగా.. కొద్ది రోజుల క్రితం ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పల్లో ముగ్గురు మృతి చెందారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్టూడెంట్స్, విద్యార్థులు, సిబ్బంది వెంటనే తరగతి గదుల్లోకి పారిపోయారు. కాల్పుల్లో మరో పది మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం