Indigo Flight Diverted to Pakistan: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ రావలసిని ఓ ఇండిగో విమానం.. పాకిస్తాన్‌లోని కరాచీలో ల్యాండ్ అయింది. షార్జా నుంచి హైదరాబాద్వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం ఉదయం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ ప్రకనటలో వెల్లడించింది. ప్రయాణికుల్ని హైదరాబాద్రప్పించేందుకు మరో విమానాన్ని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్ అవడం.. రెండు వారాల వ్యవధిలో రెండో ఘటన కావడం గమనార్హం.
ఇటీవల ఢిల్లీ నుంచి దుబాయ్వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జులై 5న పాక్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు ఫ్యూయల్ఇండికేటర్సరిగా పనిచేయకపోవడంతో కరాచీకి మళ్లించాల్సివచ్చింది. ఆ ఎస్జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్జెట్విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్ నుంచి పంపారు. కాగా .. ఇప్పటికే ఈఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
IndiGo Sharjah-Hyderabad flight diverted to Pak’s Karachi after pilot reported technical defect in the aircraft which is being examined at the airport.Airline is planning to send another aircraft to Karachi.
This is the 2nd Indian airline to make a landing in Karachi in 2 weeks pic.twitter.com/XbUcgNOzBs
— ANI (@ANI) July 17, 2022
ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో కంపనాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా గురువారం రాత్రి జైపూర్‌కు మళ్లించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..