ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా ఉత్పత్తిలో దూకుడు పెంచింది. అదనంగా మరో పది కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి గావీ వ్యాక్సిన్ కూటమికి మరో 150 మిలియన్ డాలర్లు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. భారత్‌తో పాటు దిగువ, మధ్య ఆదాయం కలిగిన దేశాలకు 2021లో ఆ డోసులను సరఫరా చేయనున్నారు.
ఆగస్టులో అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి అయిన గావి వ్యాక్సిన్ అలియన్స్, బిల్ అండ్ మెరిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా కోవిడ్ టీకాను సీరం సంస్థ అభివృద్ధి చేస్తుంది. వ్యాక్సిన్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎస్‌ఐఐకి ఈ కూటమి ఆర్థిక సహకారం అందిస్తుంది. కొవిడ్ టీకా ఉత్పత్తి కోసం సీరం సంస్థకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అదనంగా సుమారు 150 మిలియన్ల డాలర్లను మంజూరీ చేయనున్నది. అదనంగా సమకూరే ఆర్థిక సహకారం ద్వారా మొత్తం నిధుల విలువ 300 మిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ వ్యాక్సిన్ల తయారీని ఎస్‌ఐఐ వేగవంతం చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
వ్యాక్సిన్‌కు ఆమోదం లభించిన వెంటనే 2021 ఆరంభంలో గావీ కోవాక్స్ ఏఎంసీ మెకానిజమ్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని సంస్థ తెలిపింది. సురక్షిత, సమర్థవంతమైన కొవిడ్ వ్యాక్సిన్ల తయారీని, పంపిణీని ఈ ఒప్పందం వేగవంతం చేయనుంది. ఒక్కో డోసు గరిష్ఠంగా 3 డాలర్లకే అందించేందుకు ఫ్లాన్ చేస్తోంది సీరం సంస్థ.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘COVAX’ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 92 తక్కువ, మధ్య ఆదాయ దేశాలే కాకుండా 73 అధిక ఆదాయం కలిగిన దేశాలు కూడా చేరాయి.
Serum Institute to boost production to 200 million COVID vaccine doses https://t.co/4Dsg6UftuH
— Business Today (@BT_India) September 29, 2020