Saudi Arabia: ట్విటర్‌ ఉపయోగించినందుకు సౌదీ యువతికి 34 యేళ్ల జైలు శిక్ష! అసలేంజరిగిందంటే..

|

Aug 17, 2022 | 6:08 PM

తాజాగా ఓ సౌదీ యువతి ట్విటర్‌ ఉపయోగించినందుకు ఆ దేశ న్యాయస్థానం ఏకంగా 34 యేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే..

Saudi Arabia: ట్విటర్‌ ఉపయోగించినందుకు సౌదీ యువతికి 34 యేళ్ల జైలు శిక్ష! అసలేంజరిగిందంటే..
Salma Al Shehab
Follow us on

Saudi woman sentenced to 34 years for using Twitter: స్మార్ట్‌ ఫోన్‌ చేతిలోకొచ్చాక సోషల్ మీడియాను వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ నలుమూలలా సాంకేతికత విస్తరించాక ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అన్ని వయసుల వారు ఖాతాలు తెరచి విరివిగా ఉపయోగిస్తున్న సంగతి విధితమే. ఐతే తాజాగా ఓ సౌదీ యువతి ట్విటర్‌ ఉపయోగించినందుకు ఆ దేశ న్యాయస్థానం ఏకంగా 34 యేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే..

సౌదీ అరేబియా దేశంలో నిబంధనలు కఠినంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆ దేశానికి చెందిన సల్మా అల్-షెహబ్‌ (34) అనే మహిళ యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతోంది. ఐతే 2018-19 మధ్య సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. సెలవులు పూర్తి అయ్యాక తన భర్త, పిల్లలను తనతోపాటు యూకేకి తీసుకెళ్లాలని ప్లాన్ కూడా చేసుకుంది. ఐతే అంతలోనే ఆమె పౌర జాతీయ భధ్రత నిబంధనలకు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు సంబంధించిన ట్విటర్ ఖాతాలను ఫాలో చేయడమేకాకుండా వారి పోస్టులకు రీట్విట్లు చేసినట్లు భద్రతా దళం గుర్తించింది. దీంతో సౌదీ స్పెషల్ టెర్రరిస్ట్‌ కోర్టు ఆమెకు గత ఏడాది జనవరి 15న మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ఆమెపై ఆరోపించిన నేరాలను పరిగణనలోకి తీసుకోవాలని సోమవారం (ఆగస్టు 15) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు అప్పీల్‌ చేయగా, ఆమెపై ఆరోపించిన నేరానలు తీవ్రమైనవిగా పరిగణిస్తూ మరో 34 యేళ్లపాటు విదేశీ ప్రయాణాలను నిషేధించడమేకాకుండా 34 యేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇద్దరు చిన్న పిల్లలకు తల్లైన షెహబ్‌ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్‌ చేసుకోవచ్చని కూడా తీర్పులో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఐతే హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ALQST ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి పలు మానవ హక్కుల సంస్థలు తాజా తీర్పుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. షెహబ్‌ను వెంటనే విడుదలచేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.