Russia warned United States: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రష్యాను నియంత్రించేందుకు అమెరికా సహా పలు దేశాలు హెచ్చరికలు జారీ చేసినా.. పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాడులు ముమ్మరం చేయాలంటూ సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే.. పుతిన్ దళాలను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటూ.. రష్యాకు సంబంధించిన యుద్ధ సామగ్రిని ధ్వంసం చేస్తోంది. ఈ క్రమంలో రష్యా.. అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు (Weapons) అందించడం మానుకోవాలంటూ రష్యా అమెరికాను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మాస్కోలో.. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం గురించి రష్యా అమెరికా.. ఇతర దేశాలకు దౌత్యపరమైన హెచ్చరికలు పంపినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ధృవీకరించారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపడం మానుకోవాలని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని రష్యా అమెరికాను హెచ్చరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ శుక్రవారం పేర్కొంది. మాస్కోలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం గురించి యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాలకు రష్యా దౌత్యపరమైన హెచ్చిరికలు పంపినట్లు ధృవీకరించారు. అయితే ఆ సందేశం ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయనేది చెప్పలేదంటూ ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ నివేదించింది.
ఉక్రెయిన్ సైనికులకు ఆయుధాలు ఇవ్వడం ఆపాలని అమెరికా, దాని మిత్రదేశాలను కోరుతున్నాము.. దీనివల్ల ప్రాంతీయం నుంచి అంతర్జాతీయ భద్రతకు విఘాతం కలిగించే పరిణామాలు ఎదురవుతాయి.. అని అమెరికాకు రాసిన నోట్‌లో రష్యా పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
Also Read: