రష్యాకు ఉక్రెయిన్ సవాల్ విసురుతోంది. ఏడాదైనా, రెండేళ్లయినా రష్యాకు తలొగ్గేదే లేదంటోంది. పైగా కౌంటర్ ఎటాక్స్‌తో రష్యాకు వణుకు పుట్టిస్తోంది. రీసెంట్‌గా ఉక్రెయిన్ జరిగిన క్షిపణ దాడుల్లో 400 సైనికులను కోల్పోయింది రష్యా. భీకర దాడులతో రష్యా విరుచుకుపడుతోన్నా తగ్గేదేలే అంటోంది ఉక్రెయిన్. రష్యా దాడులను దీటుగా తిప్పికొడుతూ సై అంటే సై అంటూ సవాల్ విసురుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యాకు లొంగేదే లేదంటూ ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతోంది ఉక్రెయిన్. ఇప్పుడు రష్యాకి దీటుగా రివర్స్ ఎటాక్స్ చేస్తోంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ అమెరికా టూర్ తర్వాత స్పీడ్ పెంచింది ఆ దేశం. రష్యా బలగాలకు చుక్కలు చూపిస్తూ భీకర దాడులతో విరుచుకుపడుతోంది.
రీసెంట్‌గా ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 400 మంది రష్యన్ సైనికులు మరణించగా, మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా ఆక్రమించుకున్న డొనెట్స్ ప్రాంతంలో మిస్సైల్స్‌తో విరుచుకుపడింది ఉక్రెయిన్. మాస్కో సేనలు ఆశ్రయం పొందుతున్న ఓ భవనంపై క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఉక్రెయిన్ ఎటాక్‌లో పెద్దఎత్తన సైనికులను కోల్పోయింది రష్యా. ఉక్రెయిన్ చెబుతోన్న లెక్కల ప్రకారం 400 మంది రష్యన్ సైనికులు మరణించారు. అయితే, ఈ వార్తలను కొట్టిపారేస్తోంది రష్యా. ప్రాణనష్టం జరిగిన మాట నిజమే కానీ, ఉక్రెయిన్ చెబుతోన్న లెక్కలు మాత్రం అవాస్తవమంటోంది. న్యూఇయనర్ రోజు అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఊహించని స్థాయిలోనే ప్రాణనష్టం జరిగిందని చెబుతోంది. అయితే, ఎంతమంది మరణించారో తెలియాల్సి ఉందంటోంది. అమెరికన్ మేడ్ ఎంఎల్‌ఆర్‌ఎస్ హిమార్స్ మిస్సైల్స్‌తో ఉక్రెయిన్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని అంటోంది రష్యా. మొత్తం 25 రాకెట్ దాడులు జరిగినట్టు చెబుతోంది. జెలెన్‌స్కీ అమెరికా పర్యటన తర్వాత పెద్దఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్ సమకూర్చుకుందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ క్షిపణి దాడులతో కేపిటల్ కీవ్‌పై పెద్దఎత్తున దాడులు చేస్తోంది రష్యా.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి