Russia Ukraine Crisis: రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు.. కారణం అదే అంటూ ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు!

|

Mar 26, 2022 | 2:04 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తీవ్ర వాగ్వాదం తర్వాత రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గుండెపోటుకు గురయ్యారని ఉక్రెయిన్ మంత్రి అంటోన్ హెరాష్‌చెంకో పేర్కొన్నారు.

Russia Ukraine Crisis: రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు.. కారణం అదే అంటూ ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు!
Sergei Shoigu Vladimir Putin
Follow us on

Russia Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)తో తీవ్ర వాగ్వాదం తర్వాత రష్యా రక్షణ మంత్రి(Defence Minister) సెర్గీ షోయిగు(Sergei Shoigu) గుండెపోటుకు గురయ్యారని ఉక్రెయిన్ మంత్రి అంటోన్ హెరాష్‌చెంకో(Anton Herashchenko) పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య వైఫల్యానికి పుతిన్‌ను నిలదీశారు. యుద్ధానికి రెండవ సూత్రధారిగా పరిగణించే రక్షణ మంత్రి మార్చి 11 నుండి బహిరంగంగా కనిపించకపోవడానికి ఇదే కారణమని ఉక్రెయిన్ మంత్రి పేర్కొన్నారు. రష్యా రక్షణ మంత్రి మార్చి 24న టెలివిజన్‌లో కనిపించారు. అయితే ఆ ఫుటేజీ కొత్తదా పాతదా అనేది తెలియరాలేదు.

ఆయన హఠాత్తుగా అదృశ్యమైన తర్వాత రకరకాల పుకార్లు బలపడుతున్నాయి. రష్యన్ అధ్యక్షుని కార్యాలయం క్రెమ్లిన్ అధికారులు.. ఖార్కివ్ లేదా కైవ్ వంటి ప్రధాన ఉక్రేనియన్ నగరాలను ఇంకా స్వాధీనం చేసుకోనందుకు భీకర పోరు చేస్తోంది. నెల రోజులుగా యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా అధిపత్యం దక్కించుకోలేకపోతోంది. అయితే రక్షణ మంత్రి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగినప్పుడు క్రెమ్లిన్ రోజువారీ ప్రెస్ బ్రీఫింగ్‌లో ఈ సమస్యను లేవనెత్తిందని గార్డియన్ నివేదిక పేర్కొంది.

రక్షణ మంత్రి ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో బిజీగా ఉన్నారని, మీడియా కార్యకలాపాలకు ఇది సరైన సమయం కాదని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. వెంటనే, రక్షణ మంత్రి పుతిన్‌తో భద్రతా మండలి టెలికాన్ఫరెన్స్ నుండి క్లిప్‌లో టెలివిజన్‌లో కనిపించారు. అతను ప్రత్యేక సైనిక చర్యపై పురోగతిని నివేదించినట్లు చెప్పారు. గత నెల 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తూనే ఉంది.

మరోవైపు, రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. క్రెమ్లిన్ కూడా శుక్రవారం తన ప్రణాళికలో మార్పును ధృవీకరించినట్లు కనిపించింది. రష్యన్ జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్‌కోయ్ మాట్లాడుతూ, మొదటి దశ ప్రచారం ప్రధాన లక్ష్యం, ఉక్రెయిన్ పోరాట సామర్థ్యాన్ని తగ్గించడం, ప్రధానంగా అది సాధించాం, ఆ తర్వాత రష్యా సైన్యం లక్ష్యం డాన్‌బాస్ స్వేచ్ఛపై దృష్టి పెట్టడం అని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ తూర్పువైపున ఉన్న డాన్‌బాస్ పారిశ్రామిక నగరం.. పెద్ద సంఖ్యలో రష్యన్ మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులు 2014 నుండి డాన్‌బాస్‌లో ఉక్రేనియన్ దళాలతో పోరాడుతున్నారు.

Read Also….  Chhattisgarh : ఏడేళ్ల కూతురు మృతదేహన్ని భుజాన మోస్తూ.. 10 కిలోమీటర్లు నడిచిన కన్న తండ్రి