Russia Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడిని మార్చేస్తారా? కొత్త అధ్యక్షుడు అతడేనా.. పుతిన్ అసలు మాస్టర్ ప్లాన్!

|

Mar 02, 2022 | 7:34 PM

President of Ukraine: రష్యా దాడి మధ్య ఉక్రెయిన్‌లో మాజీ అధ్యక్షుడు, రష్యా అనుకూల నాయకుడు విక్టర్ యనుకోవిచ్ గురించి చాలా చర్చ జరుగుతోంది .

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడిని మార్చేస్తారా? కొత్త అధ్యక్షుడు అతడేనా.. పుతిన్ అసలు మాస్టర్ ప్లాన్!
Russia Ukraine Crisis
Follow us on

Russia Ukraine Crisis: రష్యా దాడి మధ్య ఉక్రెయిన్‌లో మాజీ అధ్యక్షుడు, రష్యా అనుకూల నాయకుడు విక్టర్ యనుకోవిచ్ గురించి చాలా చర్చ జరుగుతోంది . విక్టర్ యనుకోవిచ్(Victor Yanukovych) ప్రస్తుతం బెలారస్(Belarus) రాజధాని మిన్‌స్కీలో ఉన్నట్లు ఉక్రెయిన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అతన్ని వోలోడిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) అని పిలిచారు. అయితే, ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా ఆయనను త్వరలోనే నియమించడం జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంది. విక్టర్ 2014 తిరుగుబాటు నుండి రష్యాలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నాడు. ఉక్రెయిన్ రైట్ వింగ్ లీడర్‌కి విక్టర్ యనుకోవిచ్ అంటే అస్సలు ఇష్టం లేదు. అయితే, విక్టర్ యనుకోవిచ్ వాదనకు సంబంధించి రష్యా నుండి ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇదిలావుండగా, కైవ్‌ను కైవసం చేసుకోవడం ద్వారా వోలోడిమిర్ జెలెన్‌స్కీ అధికారాన్ని కూలదోయడమే పుతిన్ లక్ష్యమని అమెరికా, పాశ్చాత్య దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. ఆ తర్వాత వారు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి.

సోవియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ భాగం
విక్టర్ యనుకోవిచ్ గురించి తెలుసుకునే ముందు, ఉక్రెయిన్ చిన్న చరిత్రను పరిశీలిద్దాం.. ఉక్రెయిన్ మొదటిసారిగా 1919లో పీపుల్స్ రిపబ్లిక్ అయింది. ఆ తర్వాత 1922లో అప్పటి సోవియట్ యూనియన్ కిందకు వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యే వరకు ఉక్రెయిన్ భాగమే. అప్పటి నుండి ఉక్రెయిన్ ఏడు అధ్యక్ష పాలనను చూసింది, అయితే వోలోడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం తీవ్రతను అనుభవించిన మొదటి అధ్యక్షుడు. గతంలో ఉక్రెయిన్ మూడో అధ్యక్షుడు విక్టర్ యుష్చెంకో హయాంలో హత్యకు ప్రయత్నించారు. యుష్చెంకో 2004లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005లో పదవీ బాధ్యతలు స్వీకరించి 2010 వరకు పనిచేశారు.

విక్టర్ యనుకోవిచ్ జీవితం కష్టాలు
ఉక్రెయిన్ నాల్గవ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ గురించి మాట్లాడుకుందాం. విక్టర్ యనుకోవిచ్ 9 జూలై 1950న అప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన డొనెట్‌స్కీలో జన్మించాడు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. బాల్యం కష్టతరమైనదని, ఆకలితో కూడుకున్నదని విక్టర్ స్వయంగా చెబుతూనే ఉన్నారు. నేను మా అమ్మ లేకుండా పెరిగాను, ఆమె రెండు సంవత్సరాల వయస్సులో మరణించింది. నేను చెప్పులు లేకుండా వీధుల్లో నడిచేవాడిని. నా కోసం నేను అన్ని సమయాలలో పోరాడవలసి వచ్చిందని తరుచూ ఇంటర్వ్యూలో చెబుతుంటారు యనుకోవిచ్. అతని తల్లి రష్యన్ నర్సు. అతని తండ్రి పోలిష్ బెలారసియన్ లోకోమోటివ్ డ్రైవర్. కౌమారదశలో అతని తండ్రి కూడా మరణించాడు. ఆ తర్వాత యనుకోవిక్ వార్సా నుండి అతని పోలిష్ అమ్మమ్మ ద్వారా పెరిగారు. విక్టర్ యనుకోవిచ్ 17 సంవత్సరాల వయస్సులో 15 డిసెంబర్ 1967న దోపిడీ, దాడిలో పాల్గొన్నందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించారు. 8 జూన్ 1970న, అతను దాడి చేసిన ఆరోపణలపై రెండవసారి దోషిగా నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. యనుకోవిచ్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేసుకోకపోవడం గొప్ప విషయం. ప్రెసిడెంట్ అయిన తర్వాత, యనుకోవిక్ తన అరెస్టు, జైలు శిక్షను యుక్తవయస్సు తప్పులుగా పేర్కొన్నారు. 1971లో యనుకోవిచ్ లియుడ్మిలా నాస్టెంకోను వివాహం చేసుకున్నారు. అతని భార్య యెనాకియేవ్ నగర న్యాయమూర్తి అలెగ్జాండర్ సాజిన్ మేనకోడలు.

ఉక్రెయిన్ రాజకీయాల్లో చురుకుగా..
యనుకోవిచ్ రాజకీయ జీవితం ఆగష్టు 1996లో డొనెట్‌స్కీ ఒబ్లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ చీఫ్‌గా ప్రారంభమైంది. 4 మే 1997 న, అతను పరిపాలనా అధిపతిగా అంటే గవర్నర్‌గా నియమించబడ్డారు. ఆ తర్వాత విక్టర్ యనుకోవిచ్ 2014 వరకు రాజకీయాల్లో పెద్ద వైఫల్యాన్ని ఎదుర్కోలేదు. 2010 నుండి 2014 వరకు ఉక్రెయిన్ విప్లవానికి ముందు యనుకోవిచ్ అధ్యక్ష పదవిలో కొనసాగారు. అతను 21 నవంబర్ 2002 నుండి 7 డిసెంబర్ 2004 వరకు, 28 డిసెంబర్ 2004 నుండి 5 జనవరి 2005 వరకు అధ్యక్షుడు లియోనిడ్ కుచ్మా పాలనలో ఉక్రెయిన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. రష్యాతో ఆయనకు మంచి సంబంధాలుండేవి. యనుకోవిచ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహిత మిత్రుడిగా మంచి పేరుంది. ఉక్రెయిన్‌లో తిరుగుబాటు తర్వాత, అతనికి రష్యా వెంటనే ఆశ్రయం కల్పించడానికి ఇదే కారణం.

యనుకోవిచ్‌ని ఎందుకు పదవీచ్యుతుడయ్యాడు..?
సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఉక్రెయిన్‌లో పశ్చిమానికి అనుకూలమైన ఒక వర్గం ఉద్భవించింది. అయినప్పటికీ, ఉక్రెయిన్ పాలనపై రష్యా ప్రభావం ఎక్కువగా ఉంది. పాశ్చాత్య అనుకూల రాజకీయ నాయకులు రష్యా ప్రభావాన్ని ఉక్రెయిన్ పురోగతికి ప్రధాన అడ్డంకిగా భావించారు. రష్యా అనుకూల నేతలను పాలన నుంచి తొలగిస్తే తమ దేశంలో ప్రజాస్వామ్యం వస్తుందని ప్రజల్లో వాతావరణాన్ని సృష్టించారు. ఈ నాయకులు ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో భాగం కావాలని గట్టిగా వాదించారు. 2014లో యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం కోసం ఉక్రెయిన్‌లో ఒత్తిడి పెరిగింది. కానీ, అధికారంలో కూర్చున్న విక్టర్ యనుకోవిచ్, ఉక్రెయిన్ EU ఒప్పందాన్ని తిరస్కరించారు. అతని నిర్ణయాన్ని ఉక్రెయిన్ విప్లవం అనుసరించింది. 23 ఫిబ్రవరి 2014న యనుకోవిచ్ అధికారం నుండి తొలగించబడిన తర్వాత అలెగ్జాండర్ తుర్చినోవ్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 7 జూన్ 2014న, తుర్చినోవ్ స్థానంలో పెట్రో పోరోషెంకో ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వోలోడిమిర్ జెలెన్‌స్కీ అనుహ్యంగా విజయం సాధించారు.

Read Also….  పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్.. భారతీయులు వెళ్లేందుకు దాడులకు 6 గంటల విరామం ప్రకటించిన పుతిన్