Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

|

Jan 26, 2022 | 9:05 AM

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన దేశాలు.

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..  ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్
Russia Ukraine Conflict
Follow us on

Russia-Ukraine Conflict: రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన దేశాలు. రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) బార్డర్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో అత్యంత కీలక ప్రకటన చేసింది అమెరికా(America). ఏ క్షణంలో అయినా, 8వేల 500 యుద్ధ దళాలను అక్కడికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది పెంటగాన్(Pentagon).

మరోవైపు, ఉక్రెయిన్‌పై మిలటరీ దాడి చేసే ఉద్దేశం తమకు లేదని అంటోంది రష్యా. కానీ, సరిహద్దుల్లో మాత్రం లక్ష సైనిక దళాలను మోహరించింది పుతిన్ ప్రభుత్వం. ఇక్కడి దాకా ఎలా ఉన్నా, రష్యా దూకుడును అడ్డుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు పశ్చిమ దేశాలు. ఈ ఇష్యూపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరోపియన్ మిత్రదేశాలతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్‌లోకి రష్యా చొరబాటు పెరిగితే, దాని మిత్రదేశాలు అసాధారణ ఆంక్షలు విధించడంతో పాటు త్వరితంగా ప్రతిచర్యలు తీసుకోవాలని నిర్ణయించారు పలు దేశాల అధ్యక్షులు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాగి, పోలిష్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ రష్యా తీరుపై సీరియస్‌ అవుతున్నారు. అటు డెన్మార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ సహా కొన్ని నాటో సభ్య దేశాలు ఇప్పటికే తూర్పు యూరప్‌కు యుద్ధ విమానాలు, యుద్ధనౌకలను పంపే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రక్షణను బలోపేతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం అవుతోందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

Read Also…  Padma Shri: వైవిధ్యమైన ప్రాచీన కళ.. 12మెట్ల కిన్నెర రాగానికి పురస్కారం.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ