Russia Ukraine War: పుతిన్ ప్రియురాలికి వార్ సెగ.. ఆ దేశం నుంచి బహిష్కరించాలని పెరుగుతున్న డిమాండ్..!

Russia Ukraine War: ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా అధ్యక్షుడిని(Putin) నిలువరించేందుకు ప్రపంచదేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందుగా ఆర్థికంగా బలహీనం చేసేందుకు అనేక ఆంక్షలను(Sanctions) విధించాయి.

Russia Ukraine War: పుతిన్ ప్రియురాలికి వార్ సెగ.. ఆ దేశం నుంచి బహిష్కరించాలని పెరుగుతున్న డిమాండ్..!
Russia Ukraine War

Updated on: Mar 22, 2022 | 7:31 AM

Russia Ukraine War: ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా అధ్యక్షుడిని(Putin) నిలువరించేందుకు ప్రపంచదేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందుగా ఆర్థికంగా బలహీనం చేసేందుకు అనేక ఆంక్షలను(Sanctions) విధించాయి. పుతిన్ మాత్రం తగ్గేదే లే అంటూ తన సైన్యాన్ని ముందుకు వెళ్లమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పుతిన్‌ను మానసికంగా బలహీనపరిచేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం.. పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న అలీనా కబయేవా (38) ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు సమాచారం. దీంతో స్విట్జర్లాండ్‌ నుంచి ఆమెను బహిష్కరించాలంటూ అంతర్జాతీయంగా పనిచేసే change.orgలో మూడు దేశాలకు చెందిన కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యాతో పాటు ఉక్రెయిన్‌, బెలారస్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50 వేల మంది సంతకాలు చేశారు.

ఎవరీ అలీనా కబయేవా..

అలీనా కబయేవా ఒక క్రీడాకారిణి. ఆమె జిమ్నాస్ట్‌, ఒలిపింక్స్‌ గోల్డ్‌మెడలిస్ట్‌. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లో తన సంతానంతో ఓ లగ్జరీ విల్లాలో ఉంటోందని సమాచారం. వారిని సురక్షితంగా ఉంచేందుకు రష్యా అధ్యక్షుడే వారిని అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పుతిన్‌ మాత్రం అలీనాను తన ప్రేయసిగా అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అలీనా.. ఆరేళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా కూడా కొనసాగారు. గత ఏడేళ్లుగా నేషనల్ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఆమె పనిచేస్తున్నారు.

ఇవీ చదవండి..

Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. డీల్ వ్యాల్యూ ఎంతంటే..

Balakrishna PA Arrest: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..!