బ్రిటన్ ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ నేతలు రిషి సునాక్, లిజ్‌ట్రస్ మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే ఎత్తుగడలతో విజయ తీరాలకు చేరేందుకు వీళ్లిద్దరూ కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ఉత్తమ దేశంగా బ్రిటన్‌ను నిలబెట్టేందుకు రాత్రి, పగలు పనిచేస్తానని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ప్రతిజ్ఞ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి పోటీలో ఉన్న సునాక్.. ఎన్నిక ప్రక్రియ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తన ప్రచారంలో మరింత వేగం పెంచారు. ప్రధానమంత్రి పదవి చేపట్టే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 2 చివరిది కాగా.. ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం ఇరు నేతలు చివరి డిబేట్‌లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న రిషి సునాక్.. పన్నుల భారం లేని, ఉత్తమ ఆరోగ్యపథకం, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థలు ఉండడమే ముఖ్యమన్నారు.
ఇలా బ్రిటన్‌ను ఉత్తమ దేశంగా నిలబెట్టేందుకు రాత్రి, పగలు కష్టపడతానన్నారు. ఇందుకోసం తాను అమితంగా ప్రేమించే దేశంతోపాటు పార్టీ విలువలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో ముందుకెళ్తానని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా అనంతరం నూతన ప్రధాని ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇందుకోసం కన్జర్వేవిట్ పార్టీ నాయకుల్లో పలువురు పోటీలో దిగినప్పటికీ చివరకు రిషి సునాక్‌తోపాటు ట్రస్ లిజ్ మాత్రమే ప్రధాని అభ్యర్థి రేసులో మిగిలారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం