Pope Francis: వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు.. హాజరైన 164 దేశాల ప్రతినిధులు!

పేదల పోరాట యోధుడు, కాథలిక్‌ చర్చి మొట్టమొదటి లాటిన్ అమెరికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు (IST) వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ఉన్న బరోక్ ప్లాజాలో ప్రారంభమయ్యాయి.

Pope Francis: వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు.. హాజరైన 164 దేశాల ప్రతినిధులు!
Pope Francis

Updated on: Apr 26, 2025 | 3:39 PM

పేదల పోరాట యోధుడు, కాథలిక్‌ చర్చి మొట్టమొదటి లాటిన్ అమెరికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు (IST) వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ఉన్న బరోక్ ప్లాజాలో ప్రారంభమయ్యాయి. ఆయనను రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాలో ఖననం చేయనున్నారు. ఈయన అంత్యక్రియలకు భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి సహా అనేక మంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు సుమారు 2.5 లక్షల మంది భక్తులు విచ్చేశారు.

పోప్‌ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు..

మొదటగా శుక్రవారం సీల్‌ వేయబడిన పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికా ముందున్న ఎత్తైన పీఠం ముందు ఉంచుతారు. దాని ఎడమ వైపున, సెయింట్ పీటర్స్ ఎదురుగా, ఎర్రటి వస్త్రాలు ధరించిన కార్డినల్స్ కూర్చుంటారు. కుడి వైపున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారిక ప్రతినిధులు కూర్చుంటారు. ఈ వేడుక దాదాపు 90 నిమిషాలు కొనసాగుతుంది, ఈ కార్యక్రమంలో 224 మంది కార్డినల్స్, 750 మంది పూజారులు బిషప్‌లు పాల్గొంటారు. దాని తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్‌ శవపేటికను రోమ్ బాసిలికా అయిన శాంటా మారియా మాగ్గియోర్‌కు తీసుకెళ్తారు. ఇది సాయంత్రం 4:30 గంటలకు వరకు అక్కడికి చేరుకుంటుంది.  అక్కడ పేదల బృందం పోప్‌ ఫ్రాన్సిస్‌ శవపేటినకు స్వాగతిస్తుంది. ఆ తర్వాత ఆయనను ఖననం చేస్తారు.

అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా 164 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్య క్రియల నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…