Narendra Modi: ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే?

ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు పదవ రోజుకు చేరిన తరుణంలో పచ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంపై ఆయనతో చర్చించారు. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు చర్చలు, దౌత్యం కోసం ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Narendra Modi: ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే?
Modi

Updated on: Jun 22, 2025 | 4:22 PM

ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు పదవ రోజుకు చేరిన తరుణంలో పచ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంపై  ఆయనతో చర్చించారు. అక్కడ ఇటీవల నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ఉద్రిక్తతలను తగ్గించడం కోసం రెండు దేశాలు ముందుకు రావాలని.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు.

ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడానని. ప్రస్తుత పరిస్థితి గురించి తాము వివరంగా చర్చించామని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశామన్నారు. ఇరుదేశాల్లో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం కోసం చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చాను’ అని ప్రధాని మోదీ తెలిపారు.

ఇరాన్ పై అమెరికా దాడి..

ఇరాన్‌లోని అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నంలో అమెరికా కూడా పాలుపంచుకోంది. ఈక్రమంలో అమెరికా తాజాగా ఇరాన్‌లోని మూడు ప్రదేశాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అమెరికా అమెరికన్ స్టెల్త్ బాంబర్లు, 30,000-పౌండ్ల (13,600-కిలోగ్రాముల) బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. అయితే ఇరాన్ ఆయుధ-గ్రేడ్ యురేనియంను అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో వాషింగ్టన్, టెహ్రాన్ అణు ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరినట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..