Red Floods In Indonesia: వర్షం పడితే సహజంగా వీధుల్లో నీటి వరద ప్రవహిస్తుంది. మరి ఆ వరద నీరు కాకుండా రక్తం రంగులో ప్రవహిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా ఉలిక్కిపడుతాం కదూ..! ఊరికి ఏదో జరిగిందని, ఇది యుగాంతానికి సూచనే అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు హోరెత్తుతాయి.
అచ్చంగా ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవల ఇండోనేషియాలో జరిగింది. తాజాగా శనివారం ఇండోనేషియాలో జెంగ్‌గోట్ అనే గ్రామంలో భారీ వర్షం కురిసింది. దీంతో వీధుల్లోకి వరద పెద్ద ఎత్తున వచ్చింది. అయితే ఈ వరద ఎర్రటి రక్తంలా ఉండడంతో ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. తమ సెల్ ఫోన్లతో వీడియోలు తీసి నెట్టింట్లో పోస్ట్‌లు చేశారు. అయితే ఈ విషయమై స్పందించిన అధికారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంతకీ ఆ ఎర్రటి వరదకు కారణమేంటనేగా మీ సందేహం.. వర్షం కురిపించిన ప్రాంతానికి సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. అధికారులు ఈ విషయాన్ని తెలియజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Banjir Pekalongan nie, warna merah akibat campuran pewarna batik
Cc @ganjarpranowo pic.twitter.com/4keU1JwGEt— Raja Purwa (@Raj4Purwa) February 6, 2021
Also Read: అరుణ గ్రహం తొలి ఇమేజ్ ని పంపిన చైనా ఉపగ్రహం, లోతైన ‘క్రేటర్ల’ తో నిండిన మార్స్,