అయ్యా బాబోయ్‌.. డైనోసార్స్ కంటే పురాతనమైన చేప..10 అడుగుల పొడవు, భారీ బరువుతో కొత్త రికార్డ్..!

|

Jan 28, 2023 | 12:45 PM

ఆ తర్వాత వింతగా కనిపించిన ఆ చేపను అధికారులకు చూపించారు. అప్పుడు తెలిసిందేంటంటే.. వీరికి చిక్కిన ఆ చేప డైనోసార్ల కంటే పురాతనమైనది.

అయ్యా బాబోయ్‌.. డైనోసార్స్ కంటే పురాతనమైన చేప..10 అడుగుల పొడవు, భారీ బరువుతో కొత్త రికార్డ్..!
Living Fossils
Follow us on

అలబామాలో చేపల వేటకు వెళ్లిన ఓ తండ్రీ కొడుకులకు అరుదైన భారీ చేపచిక్కింది. ఈ చేపతో ఆ రాష్ట్రంలోనే వారు కొత్త రికార్డు సృష్టించారు. వారి అలవాటులో భాగంగా చేపల వేటకు వెళ్లిన ఆ తండ్రీ కొడుకులు.. సాధారణంగానే నీటిలో వల వేశారు. ఆ తర్వాత బరువెక్కిన వలను పైకి లాగే క్రమంలో వారికి షాక్‌ తిన్నంత పనైంది. ఎందుకంటే వారు దానిని తమ పడవలోకి లాగుతున్నప్పుడు అదేంటో తెలియక అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత వింతగా కనిపించిన ఆ చేపను అధికారులకు చూపించారు. అప్పుడు తెలిసిందేంటంటే.. వీరికి చిక్కిన ఆ చేప డైనోసార్ల కంటే పురాతనమైనది. అతి అరుదైన ‘సజీవ శిలాజ’ ఫిష్‌గా తెలిసి వారు ఆశ్చర్యపోయారు.

ఆశ్చర్యపోయిన తండ్రి కొడుకులు, కీత్ డీస్, హంట్లీ గత నవంబర్‌లో మొబైల్-టెన్సా డెల్టా, అలబామాలో వారి వార్షిక థాంక్స్ గివింగ్ ఫిషింగ్ ట్రిప్‌లో ఉండగా, వారు అరుదైన “సజీవ శిలాజ” ఫిష్‌ని పట్టుకున్నారు. భయంకర క్యాచ్ డైనోసార్ల కంటే కూడా ఈ చేప పురాతనమైనదిగా తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది వారి ఫిషింగ్‌ హ్యబిట్‌లో రికార్డు-బ్రేకింగ్ ఆవిష్కరణగా..వెల్లడించారు. ఇలాంటి నమ్మశక్యం కానీ ఈ విషయాన్ని ఆ తండ్రీకొడుకులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతో వార్త వైరల్‌ అవుతోంది.

ఈ చేప అధికారికంగా ఆరెంజ్ బీచ్ మెరీనాలో తూకం వేయబడింది.162lbs (73.5kg) బరువుంది. ఇది మునుపటి అలబామా రాష్ట్ర రికార్డును 11lbs అధిగమించింది. ఈ ఫిష్ సుమారు సుమారు 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది.అయితే కొన్ని 10 అడుగుల వరకు కూడా పెరుగుతాయంటున్నారు.ఉత్తర అమెరికాలోని అతిపెద్ద మంచినీటి చేపలలో గార్ కుటుంబానికి చెందిన అతిపెద్ద జాతులు, చరిత్రపూర్వం పూర్వీకుల కొన్ని లక్షణాలను నిలుపుకున్న వాటిని “జీవన శిలాజాలు” అని పిలుస్తారు. రేజర్-పదునైన దంతాలతో కప్పబడిన పొడవాటి ముక్కు కారణంగా వాటికి ఈ పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..