PM Modi: రోమ్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పియాజా గాంధీ వద్ద మహాత్ముడికి నివాళి..

ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల రోమ్ పర్యటన సందర్భంగా శుక్రవారం పియాజా గాంధీ వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.

PM Modi: రోమ్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పియాజా గాంధీ వద్ద మహాత్ముడికి నివాళి..
Prime Minister Narendra Mod
Follow us

|

Updated on: Oct 29, 2021 | 5:21 PM

ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల రోమ్ పర్యటన సందర్భంగా శుక్రవారం పియాజా గాంధీ వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రపంచానకి ఆయన అందించిన స్ఫూర్తి కొనసాగుతుందని అన్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రోమ్‌లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి రోమ్‌లో దాదాపు 60 గంటలపాటు ఉంటారు. ప్రధాని తన పర్యటనలో ఎనిమిది దేశాల నేతలు లేదా అధినేతలతో సమావేశమవుతారు. ఇటలీ, స్పెయిన్, సింగపూర్ ప్రధానులు, జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్, ఇండోనేషియా అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

దీంతో పాటు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. దౌత్య సమావేశాలే కాకుండా అందరి దృష్టి ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ల భేటీపైనే ఉంటుంది. అక్టోబర్ 30 ఉదయం వాటికన్ ప్రైవేట్ లైబ్రరీలో పోప్‌తో ప్రధాని భేటీ అవుతారు. ‘కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్’గా పిలిచే వాటికన్‌లో పోప్ ముఖ్య సలహాదారుని కూడా ప్రధాని మోడీ కలవనున్నారు.

పియాజా గాంధీ వద్ద మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి..

అయితే జీ20 సమ్మిట్‌కు ముందు రోమ్‌లో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్‌తోపాటు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో ప్రధాని మోడీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి, పర్యావరణం, వాతావరణ మార్పులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రోమ్ చేరుకున్న ప్రధాని మోడీకి స్థానికుల నుంచి భారీ స్పందన లభించింది. రోడ్లపైకి వచ్చిన స్థానిక భారతీయులు మోడీ.. మోడీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రోమ్‌లోని భారతీయ సమాజం ప్రధానికి “మోడీ.. మోడీ” అంటూ స్వాగతం..

దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోడీ కావడం విశేషం. రేపటి నుంచి రెండు రోజుల పాటు వాటికన్ సిటీలో జరగబోయే జీ20 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ఇండోనేషియా, సింగపూర్, జర్మనీ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశం జరుగనుంది. ఈ పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిప్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

అక్కడి నుంచి ప్రధాని మోడీ యూకే బయల్దేరుతారు. యూకే ప్రధాని బోరిన్ జాన్సన్ ఆహ్వానం మేరకు నవంబర్ 1న గ్లాస్గోలో జరిగే కాప్ 26 సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. పర్యటన ముగించుకుని నవంబర్ 3న ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి: Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్

Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్‌.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు