రన్ వే నుంచి గడ్డిలోకి దూసుకెళ్లిన విమానం.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

| Edited By:

Mar 14, 2019 | 5:04 PM

ఫిలిప్పీన్స్‌లో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్‌ అవుతుండగా చక్రాల్లో ఒకటి రన్‌వేపై ఉన్న గడ్డిలో చిక్కుకుపోయింది. పైలట్‌ అప్రమత్తతతో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు. ఫిలిప్పీన్స్ లోని కలిబో విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 122 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం రన్‌వే చివర్లో మలుపుతిరుగుతుండగా గడ్డిలో చక్రం చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన విమాన పైలట్‌ వెంటనే అప్రమత్తమై విమానాన్ని చాకచక్యంగా నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు […]

రన్ వే నుంచి గడ్డిలోకి దూసుకెళ్లిన విమానం.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
Follow us on

ఫిలిప్పీన్స్‌లో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్‌ అవుతుండగా చక్రాల్లో ఒకటి రన్‌వేపై ఉన్న గడ్డిలో చిక్కుకుపోయింది. పైలట్‌ అప్రమత్తతతో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు. ఫిలిప్పీన్స్ లోని కలిబో విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 122 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం రన్‌వే చివర్లో మలుపుతిరుగుతుండగా గడ్డిలో చక్రం చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన విమాన పైలట్‌ వెంటనే అప్రమత్తమై విమానాన్ని చాకచక్యంగా నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.