Living Cartoon: లివింగ్ కార్టూన్‌గా మారడం కోసం.. ఏకంగా రూ.77 లక్షలు ఖర్చుపెట్టిన యువతి.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా…

|

May 31, 2022 | 8:27 AM

పిక్సీ ఫాక్స్ కు కార్టూన్లలో కనిపించే అమ్మాయి వంటి సన్నని నడుము అంటే ఇష్టం.. అలాంటి నడుము తనకు ఉండాలని చాలా ఇష్టపడింది. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవోడం కోసం.. తన శరీర భాగాల్లో వివిధ ప్లాస్టిక్ సర్జీలు చేయించుకుని.. చివరికి 2016లో లివింగ్ కార్టూన్ అమ్మాయిగా మారింది.

Living Cartoon: లివింగ్ కార్టూన్‌గా మారడం కోసం.. ఏకంగా రూ.77 లక్షలు ఖర్చుపెట్టిన యువతి.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా...
Living Cartoon Pixee Fox
Follow us on

Living Cartoon: చేతి ఐదువేళ్ళు ఒకలా ఉండనట్లే.. అందరి ఆలోచనలు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఒకేలా ఉండవు.. అందుకే మన పెద్దలు లొకోభిన్నరుచిః అని అన్నారు. ప్రపంచంలో రకరకాల మనుషులు.. ఒకొక్కరిది ఒక్కో ఆలోచన..  ఒకో రకమైన మనస్తత్వం. అందుకనే ఎదుటి వారిని అంచనా వేయాలనుకుంటే , వారి ఇష్టాయిష్టాలు పరిశీలించు , మాటలను పరీక్షించు ,ప్రవర్తన గమనించు అప్పుడే వారిని సరిగ్గా అంచనా వేయగలుగుతావని కూడా చెబుతారు. అయితే కొంతమంది భిన్నమైన టేస్టుని కలిగి ఉంటారు. కొంతమంది తమ శరీరాకృతి తమకు నచ్చినట్లు మార్చుకోవాలని అమితంగా ఆసక్తిని చూపిస్తారు. అందుకు అనుగుణంగా ప్లాస్టిక్ సర్జరీ వంటి వాటిని ఆశ్రయించి..తమ అభిరుచిని నెరవేర్చుకుంటూ.. పదుగురిలో స్పెషల్ గా నిలుస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలిచింది.. ఇటీవల జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. కుక్కగా కనిపించాలన్న తపనతో ఏకంగా లక్షలు ఖర్చు పెట్టాడు. ఈ నేపథ్యంలో గతంలో మహిళ తన నడుము.. కార్టూన్ లో కనిపించే అమ్మాయిలా ఉండాలని కోరుకోవడం.. ఇందుకు ఆ యువతి పెట్టిన లక్షల  ఖర్చు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ యువతి పేరు  పిక్సీ ఫాక్స్ .. వివరాల్లోకి వెళ్తే..

స్వీడన్ కు చెందిన పిక్సీ ఫాక్స్  చిన్నతనం నుంచి కార్టూన్స్ చూస్తూ పెరిగింది. ముఖ్యంగా కార్టూన్ లోని అమ్మాయిల రూపు రేఖలు పిక్సీ ని అమితంగా ఆకర్షించాయి. ముఖ్యంగా  కార్టూన్ షోల్లోని హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్‌లోని జెస్సికా రాబిట్, స్లీపింగ్ బ్యూటీలోని అరోరా, కూల్ వరల్డ్‌లోని హోలలీ వుడ్ క్యారెక్టర్లంటే అమితంగా ఇష్టపడేది. దీంతో తాను ఎలాగైనా సరే.. కార్టూన్ లో కనిపించే అమ్మాయిగా మారాలని అందుకు అనుగుణంగా తన శరీరంలో మార్పులు చేసుకోవాలని కోరుకుంది. కొన్ని సంవత్సరాల పాటు.. తన శరీర భాగాల్లో వివిధ ప్లాస్టిక్ సర్జీలు చేయించుకుని.. చివరికి 2016లో లివింగ్ కార్టూన్ అమ్మాయిగా మారింది. ఇలా తనకు ఇష్టమైన రూపంలోకి మారడం కోసం పిక్సీ ఫాక్స్ అక్షరాల రూ.77 లక్షల 60వేలు ఖర్చు పెట్టిందట.

పిక్సీ ఫాక్స్ కు కార్టూన్లలో కనిపించే అమ్మాయి వంటి సన్నని నడుము అంటే ఇష్టం.. అలాంటి నడుము తనకు ఉండాలని చాలా ఇష్టపడింది. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవోడం కోసం.. వైద్యులను సంప్రదించింది. కార్టూన్ లోని అమ్మాయిలకు ఉండే సన్నని నడుము, పెదవులు, ముక్కు, బ్రెస్ట్ ఇలా అన్నిటిని అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని.. సరికొత్త రూపముతో లివింగ్ కార్టూన్ గా మారాలని కోరుకుంది. తన కోరిక నెరవేర్చుకోవడం  కోసం ఏకంగా.. 2010లో తొలి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అలా వరుసగా సర్జరీలు చేయించుకుంటూ.. చివరికి 2016లో వెన్నెముకకు రెండువైపులా ఉండే 6 ఎముకలను తొలగించుకుంది. దీంతో నడుం కొలత 14 అంగుళాలకు చేరుకుంది. అనంతరం.. ముక్కు,కనురెప్పలు, వక్షోజాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ప్రస్తుతం 32 ఏళ్ల పిక్సీని ప్రపంచం లివింగ్ కార్టూన్‌గా గుర్తిస్తోంది. సెలబ్రిటీ హోదాతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఎక్కడైనా ఏదైనా మనిషి వింత కోరిక వెలుగులోకి వస్తే.. వెంటనే పిక్సీ ఫాక్స్ నడుమ కోసం పడిన తపన.. ఆరాటం.. పెట్టిన ఖర్చు వెంటనే గుర్తుకొస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..