COVID-19 vaccine: పిల్లలకూ రెడీ అవుతున్న కరోనా వ్యాక్సిన్.. ఫైజర్ టీకా ట్రయల్స్‌ విజయవంతం

|

Mar 31, 2021 | 11:51 PM

Pfizer-BioNTech COVID-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. అయితే వ్యాక్సిన్లు తీసుకుంటున్నప్పటికీ.. కొంతమంది కరోనా బారిన పడుతుండటం

COVID-19 vaccine: పిల్లలకూ రెడీ అవుతున్న కరోనా వ్యాక్సిన్.. ఫైజర్ టీకా ట్రయల్స్‌ విజయవంతం
Pfizer Biontech Covid 19 Vaccine
Follow us on

Pfizer-BioNTech COVID-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. అయితే వ్యాక్సిన్లు తీసుకుంటున్నప్పటికీ.. కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ సమర్థతపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లు పెద్దవారికే ఇస్తున్నారు. చిన్నపిల్లలకు ఇంకా వ్యాక్సిన్ రాలేదు. ఈ నేపథ్యంలో ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకూ కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడైంది. పదిహేనేళ్ల లోపు వయసున్న పిల్లల్లో ఫైజర్ టీకా కరోనా వ్యాధిని 100 శాతం నిరోధిస్తుందంటూ ఫార్మా కంపెనీలు ఫైజర్, బయోఎన్‌టెక్ తాజాగా ప్రకటించాయి. అమెరికాలో మొత్తం 2260 మంది పిల్లలపై పరీక్షలు జరపగా.. టీకా సామర్థ్యం 100 శాతంగా ఉన్నట్టు తేలిందని పేర్కొన్నాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ 12 నుంచి 15 ఏళ్ల పిల్లలపై నిర్వహించారు. ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు తెలిపాయి.

ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పిస్తామని ఫైజర్ సీఈవో ఆల్బర్టా బోర్లా బుధవారం ప్రకటించారు. పిల్లలు కరోనా బారిన పడకుండా తమ టీకా అత్యధిక రక్షణ ఇస్తుందని బయోఎన్‌టెక్ కంపెనీ కూడా వెల్లడించింది. అత్యాధునిక ఎమ్‌ఆర్‌ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా ఫైజర్ టీకాను అభివృద్ధి చేశారు. దీంతో అమెరికాతో పాటూ ఐరోపా సమాఖ్య కూడా 16 ఏళ్లు పైబడి వారిపై దీన్ని ఉపయోగించేందుకు అనుమతించాయి. ఇప్పటికీ వరకూ 65 దేశాల్లో లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ను అందించారు.

ఇటీవల ఇజ్రాయెల్‌లో 10.2 లక్షల మందిపై జరిగిన పరిశోధనలో ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావశీలత 95 శాతం నమోదైంది. ఈ ఏడాదిలో మొత్తం 2.5 బిలయన్ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యామని ఫైజర్ ప్రకటించింది. బ్రెజిల్, అమెరికాలో ఉన్న ప్లాంట్లలో ఈ టీకా ఉత్పత్తి వేగవంతంగా జరుగుతోంది. అయితే ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో వచ్చే విద్యాసంవత్సరం నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం.

Also Read:

India – Pakistan : దారిలోకొచ్చిన దాయాది దేశం… భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతులకు పాక్ గ్రీన్ సిగ్నల్

అమెరికా నేవీ బృందం ఇండియా​ కోసం హిందీ పాటను ఆలపించిన అరుదైన సంఘటన.. ( వీడియో )