ఆప్యాయంగా పెంచుకున్న యజమాని ప్రాణాలే తీసింది

గత రెండేళ్లుగా ఆప్యాయంగా పెంచుకుంటున్న యజమాని కుటుంబంపైనే దాడి చేసింది ఓ జింక. ఈ దాడిలో యజమాని మరణించగా.. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఉదయం తను పెంచుకుంటోన్న జింక దగ్గరకు వెళ్లాడు యజమాని. ఆ సమయంలో అతడిపైఒక్కసారిగా దాడి చేసింది ఆ మృగం. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు భార్య ప్రయత్నించగా.. ఆమెపై కూడా ఆ జింక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మరణించాడు. […]

ఆప్యాయంగా పెంచుకున్న యజమాని ప్రాణాలే తీసింది

Edited By:

Updated on: Apr 17, 2019 | 5:06 PM

గత రెండేళ్లుగా ఆప్యాయంగా పెంచుకుంటున్న యజమాని కుటుంబంపైనే దాడి చేసింది ఓ జింక. ఈ దాడిలో యజమాని మరణించగా.. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.

బుధవారం ఉదయం తను పెంచుకుంటోన్న జింక దగ్గరకు వెళ్లాడు యజమాని. ఆ సమయంలో అతడిపైఒక్కసారిగా దాడి చేసింది ఆ మృగం. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు భార్య ప్రయత్నించగా.. ఆమెపై కూడా ఆ జింక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో భార్య బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని జింకపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ యజమాని భార్యను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.