ఇళ్లలోనే ఎక్కువ మందికి కరోనా వ్యాప్తి

| Edited By:

Jul 23, 2020 | 12:04 PM

కరోనా వైరస్ వ్యాప్తి ఎలా అధికంగా జరుగుతుందన్న విషయంపై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా రోగ విఙ్ఞాన నిపుణులు మరో షాకింగ్‌ న్యూస్‌ని వెల్లడించారు

ఇళ్లలోనే ఎక్కువ మందికి కరోనా వ్యాప్తి
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి ఎలా అధికంగా జరుగుతుందన్న విషయంపై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా రోగ విఙ్ఞాన నిపుణులు మరో షాకింగ్‌ న్యూస్‌ని వెల్లడించారు. బయటి వ్యక్తుల నుంచి కన్నా ఇంట్లోనే కుటంబ సభ్యుల ద్వారా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని వారు తెలిపారు. ఈ అధ్యయనాన్ని అమెరికా సెంటర్స్‌ ఫర్ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌(సీడీసీ) జర్నల్‌లో ప్రచురించారు.

జూలై 16 నాటికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 5,706 మందిపై వారు ఈ అధ్యయనం చేశారు. వారికి ఎవరి నుంచి వైరస్‌ సోకిందన్న విషయంపై పరిశీలన చేశారు. ఇక అందులో ప్రతి వంద మందిలో కేవలం ఇద్దరికే బయటి వ్యక్తుల నుంచి వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే ప్రతి పది మందిలో ఒకరికి కుటుంబ సభ్యుల నుంచి వచ్చినట్లు తేలింది. దీంతో ఇళ్లలోనే ఎక్కువగా కరోనా వైరస్ వ్యాపిస్తుందని వారు తెలిపారు.