అమెరికాపై పగబట్టిన ప్రచండభానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు..

అధిక ఉష్ణోగ్రతలతో అమెరికా మండిపోతుంది. మండే ఎండల దాటికి డొనాల్డ్ ట్రంప్ సభకు వచ్చిన 11మంది వడదెబ్బకు గురయ్యారు. మనకు మన్నటి వరకు వేసవితాపం హాహాకారాలు చేయించినప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకి నిప్పులు చెరుగుతుండడంతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అమెరికాపై పగబట్టిన ప్రచండభానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు..
America
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:00 AM

అధిక ఉష్ణోగ్రతలతో అమెరికా మండిపోతుంది. మండే ఎండల దాటికి డొనాల్డ్ ట్రంప్ సభకు వచ్చిన 11మంది వడదెబ్బకు గురయ్యారు. మనకు మన్నటి వరకు వేసవితాపం హాహాకారాలు చేయించినప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకి నిప్పులు చెరుగుతుండడంతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు మంచుతుఫాన్లతో, భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన అమెరికన్లు.. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని నైరుతీ రాష్ట్రాలను భానుడి ప్రచండతాపం బెంబేలెత్తిస్తోంది. ఆగ్నేయ క్యాలిఫోర్నియా మొదలుకొని అరిజోనా, నెవడా రాష్ట్రాల వరకు రెండుమూడు రోజుల క్రితం పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. నెవాడా రాష్ట్రంలోని లాస్‌ వేగాస్‌లో నిన్న కూడా వేడి గాలులు కొనసాగాయి. నైరుతి అమెరికాలో వేసవి మొదలుకావడానికి ఇంకా రెండు వారాల వ్యవధి ఉన్నా సూర్య ప్రతాపం ముందే మొదలైంది.

ఫినీక్స్‌ పట్టణంలో 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై కొత్త రికార్డు నెలకొల్పింది. ఫినీక్స్‌లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ సభకు వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బ తగలడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. నెవడా రాష్ట్రంలోని రీనో నగరంలో సాధారణంగా 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. రెండు క్రితం అక్కడ 37 డిగ్రీలు నమోదైంది. అరిజోనా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కొనసాగనున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్‌కు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2015 ప్యారిస్‌ వాతావరణ చర్చల్లో విధించుకున్న పరిమితి దాటిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రతీ గంట వేడిగా మారుతోందని తెలిపారు. ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, తగినన్ని మంచినీరు తాగాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. 2016లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మునుపటి రికార్డులు బద్దలవుతాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!