సునీతా విలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా? నాసా తాజాగా ఏం చెప్పింది? అసలు అంతరిక్షంలో ఏం జరుగుతోంది?

సునీతా విలియమ్స్‌తో టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకున్నారు. ఈ నిరీక్షణ ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై ఎటువంటి నిర్ధారణ చేయలేదు. టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌తో కలిసి జూన్ 5వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లాడు. వీరిద్దరూ వెళ్ళిన మిషన్ ఒక వారం మాత్రమే అంతరిక్షంలో ఉండాలి. కక్ష్యలో ఉన్న ల్యాబ్‌ను సందర్శించాలి. అయితే అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్, థ్రస్టర్‌ల వైఫల్యం కారణంగా వీరిద్దరూ అక్కడ చిక్కుకుపోయారు.

సునీతా విలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా? నాసా తాజాగా ఏం చెప్పింది? అసలు అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
Sunita WilliamsImage Credit source: NASA
Follow us

|

Updated on: Jul 26, 2024 | 7:35 PM

నెల రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌కు సంబంధించిన ఒక అప్‌డేట్ వచ్చింది. నాసా చాలా నిరాశాజనకమైన వార్తని వినిపించింది. వ్యోమగాములు, బోయింగ్ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రానికి తిరిగి రావడానికి ఇంకా తేదీని నిర్ణయించలేదని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్‌తో టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకున్నారు. ఈ నిరీక్షణ ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై ఎటువంటి నిర్ధారణ చేయలేదు.

టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌తో కలిసి జూన్ 5వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లాడు. వీరిద్దరూ వెళ్ళిన మిషన్ ఒక వారం మాత్రమే అంతరిక్షంలో ఉండాలి. కక్ష్యలో ఉన్న ల్యాబ్‌ను సందర్శించాలి. అయితే అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్, థ్రస్టర్‌ల వైఫల్యం కారణంగా వీరిద్దరూ అక్కడ చిక్కుకుపోయారు. ఇప్పుడు తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌లు భూమి మీదకు తిరిగి తీసుకుని రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లిఫ్ట్‌ఆఫ్ అయిన ఒక రోజు తర్వాత జూన్ 6న, క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో ఐదు థ్రస్టర్‌లు విఫలమయ్యాయి. దీంతో వీరిద్దరూ అంతరిక్షంలో కూరుకుపోయి నెల రోజులైంది.

తిరిగి వచ్చే తేదీని చెప్పడానికి సిద్ధంగాలేని నాసా

బోయింగ్ క్యాప్సూల్ సమస్యలను తొలగించడం కోసం టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌ కలిసి తమ పనిని పూర్తి చేసే అంతరిక్షంలో ఉండవలసి ఉంటుందని నాసా అధికారులు తెలిపారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూటెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌ భూమికి తిరిగి వచ్చే తేదీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడానికి మిషన్ మేనేజర్లు ఇంకా సిద్ధంగా లేరని చెప్పారు. ఇంజనీర్లు గత వారం న్యూ మెక్సికో ఎడారిలో స్పేర్ థ్రస్టర్‌పై పరీక్షను పూర్తి చేశారు. డాకింగ్ సమయంలో ఏమి తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో హీలియం లీక్, థ్రస్టర్ పేలవమైన సీల్ కారణంగా అన్ని సమస్యలు సంభవించాయని.. అయితే తర్వాత ఏమి చేయాలి అనే విషయంపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్న నాసా

బోయింగ్ కి చెందిన మార్క్ నప్పి మాట్లాడుతూ బృందం ఈ వారంలో స్పేస్ స్టేషన్‌లో డాక్ చేయబడినప్పుడు థ్రస్టర్‌ను పరీక్షిస్తుంది.. తద్వారా మరింత డేటాను సేకరించవచ్చని చెప్పారు. స్పేస్ షటిల్ పదవీ విరమణ చేసిన తర్వాత, NASA బోయింగ్, SpaceX లకు బిలియన్ల డాలర్లు చెల్లించి వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి తరలించడానికి ప్రైవేట్ కంపెనీలను నియమించింది. బోయింగ్‌లో సిబ్బందితో ఇది మొదటి టెస్ట్ ఫ్లైట్, స్పేస్‌ఎక్స్ 2020 నుంచి వ్యోమగాములను తీసుకువెళుతోందని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..బ్రో! చోరీకెళ్లి ఏం చేశాడో చూడండి
నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..బ్రో! చోరీకెళ్లి ఏం చేశాడో చూడండి
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
సునీతావిలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా? నాసా తాజాగా ఏంచెప్పిందంటే
సునీతావిలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా? నాసా తాజాగా ఏంచెప్పిందంటే
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా ఛాన్సుల్లేని నటి
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా ఛాన్సుల్లేని నటి
రమ్యకృష్ణ ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించారా..
రమ్యకృష్ణ ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించారా..
వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!
వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!
ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
ఈ సీజన్‌లో మసాలా గ్రీన్ టీ బెస్ట్ ఎంపిక.. రెసిపీ మీ కోసం..
ఈ సీజన్‌లో మసాలా గ్రీన్ టీ బెస్ట్ ఎంపిక.. రెసిపీ మీ కోసం..
మొబైల్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి..!
మొబైల్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి..!
రేవ్ పార్టీ నిందితుల‌కు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సెలింగ్
రేవ్ పార్టీ నిందితుల‌కు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సెలింగ్
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం