రష్యాలో ఇంత మంది భారతీయ విద్యార్థులు ఏంచేస్తున్నారు..?
TV9 Telugu
10 July 2024
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల మిత్ర దేశం రష్యా పర్యటనలో చాల బిజీగా ఉన్నారు.
ప్రధాని మోదీ మూడో టర్మ్ ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటించారు.
రష్యాలో ఎంత మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారు ఏమి చదువుతున్నారో తెలుసా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం భారత మిత్ర దేశం రష్యాలో దాదాపు 15 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది రష్యాలో ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీల్లో మెడిసిన్ విద్యను చదువుతున్నారు.
గతంలో భారతీయ విద్యార్థులు చైనా, ఉక్రెయిన్‌లకు వెళ్లగా, ఇప్పుడు ఎక్కువ మంది రష్యాకు చదువుల కోసం వెళ్తున్నారు.
ప్రస్తుతం రష్యా దేశంలో దాదాపు 62 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇందులో ఎన్నారైలు కూడా కొంతమంది ఉన్నారు.
ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు రష్యాలో చదువుకోవడానికి ఇష్టపడుతున్నారని సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి