వరల్డ్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఎదో తెలుసా..?
TV9 Telugu
24 July 2024
హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం. భారతీయ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ.
ప్రస్తుతం సెనిగల్, తజికిస్తాన్ దేశాల ర్యాంక్‌లతో ఇండియా ర్యాంక్ సమానంగా ఉన్నట్లు ఈ జాబితాలో వెల్లడైంది.
అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ మొదటి స్థానం.సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 195 దేశాల్లో వీసా లేకుండానే ఎంట్రీ.
రెండో స్థానంలో జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ.
ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలకు మూడవ ర్యాంక్. ఈ దేశాల పాస్‌పోర్టుతో 191 దేశాల్లోకి ఎంట్రీ ఫ్రీ.
నాలుగవ స్థానంలో యూకేతో పాటు న్యూజిలాండ్, నార్వే, బెల్జింయ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు.
తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 8వ స్థానానికి పడిపోయింది. అమెరికా వీసా ఉంటే 186 దేశాలకు వీసా ఫ్రీ ఏంట్రీ..
9వ స్థానంలో ఈస్టోనియా, లిథుయేనియా, యూఏఈ దేశాలు. పదవ ర్యాంక్‌లో ఐస్‌ల్యాండ్, లాతివ్యా, స్లోవేకియా, స్లోవేనియా దేశాలు ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి