11 దేశాల గుండా ప్రవహించే నది ఏమిటో తెలుసా..! 

18 July 2024

TV9 Telugu

Pic credit - pexels

ప్రపంచంలోని అనేక దేశాలలో నదులు ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులు ఒక దేశంలో పుట్టి.. ఆ దేశ సరిహద్దును దాటి మరో దేశంలో అడుగు పెడతాయి.

ఒకదేశంలో పుట్టి మరొక దేశంలో

ఇలా నదులు ఒక దేశం నుంచి మరొక దేశంలో అంటే రెండు.. లేదా మూడు దేశాలలో ప్రవహిస్తాయి. కానీ ఒక నది మాత్రం 2 లేదా 3 కాదు, 11 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఆ నది ఏమిటంటే..? 

నది 11 దేశాలలో ప్రవాహం 

ప్రపంచంలోనే పొడవైన నైలు నది ఏకంగా 11 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇది ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు విక్టోరియా నుండి ఉద్భవించింది. 

నైలు నది

నైలు నది ఆఫ్రికాలో ప్రవహిస్తుంది. ఇది బురుండి నుంచి ఉద్భవించి, ఈశాన్య ఆఫ్రికా గుండా ప్రవహిస్తూ చివరికి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. 

ఆఫ్రికన్ నది

నైలు నది పొడవు 6690 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నది అనే బిరుదును కలిగి ఉంది.

పొడవైన నది

నైలు నది ఆఫ్రికన్ ఖండంలోని పెద్ద భూభాగంలో ప్రవహిస్తుంది. ఉగాండా, ఇథియోపియా, సూడాన్, దక్షిణ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, టాంజానియా, రువాండా, బురుండి , ఈజిప్ట్, ఎరిట్రియా దేశాల్లో ప్రవహిస్తుంది.

ఏ దేశాల్లో ప్రవహిస్తుందంటే 

ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నదికి  బ్లూ నైలు , వైట్ నైలు ప్రధాన ఉపనదులు. ఈ నది దక్షిణం వైపు ప్రవహిస్తుంది .. చివరికి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.

ఉపనదులు  

 కెన్యా దేశ జనాభాలో సుమారు 40% మందికి నైలు నది నీరు ప్రధాన వనరు.. ఈ నది మీదుగా సాగే రవాణా ప్రధాన ఆదయ వనరు.

ప్రధాన ఆదయ వనరు