Ceasefire Violation: కాల్పుల విరమణను ఉల్లంఘించలేదన్న పాక్.. భారత్‌పై కీలక ఆరోపణ!

భారత్-పాకిస్తాన్ సరిహద్దులో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక దాడులు శనివారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆగిపోయాయి. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే భారత్-పాకిస్తాన్ పరస్పరం "ఉల్లంఘనలు" చేశాయని ఆరోపించుకున్నాయి. భారత్‌ పాలిత కాశ్మీర్‌లో పాక్‌ దాడులకు పాల్పడగా..వాటిని భారత సైన్యం ఎదుర్కొంది. అయితే భారత్‌ నుంచి కూడా ఉల్లంఘనలు జరిగాయన పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కింది.

Ceasefire Violation: కాల్పుల విరమణను ఉల్లంఘించలేదన్న పాక్.. భారత్‌పై కీలక ఆరోపణ!
India Pakistan War

Updated on: May 11, 2025 | 7:18 AM

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక దాడికి శనివారం తెరపడింది. రెండు దేశాలతో ఆమెరికా 48 గంటల పాటు చర్చలు తర్వాత..భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాగా ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లో పాకిస్తాన్ దీన్ని ఉల్లంఘిస్తూ భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లో మరోసారి దాడులకు తెలగబడింది. అఖ్నూర్, పూంచ్, నౌషెరా, శ్రీనగర్, ఆర్‌ఎస్ పురా, సాంబా, ఉధంపూర్‌లలో పాకిస్థాన్ కాల్పులు జరిపినట్టు భారత్‌ ఆర్మీ తెలిపింది. భారత్‌లోకి వచ్చిన పాక్‌ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది.

విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లో పాక్‌ దానిని ఉల్లంఘించింది. దీనిని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. పాక్‌ హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భారత్‌ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని భారత్‌ ఆర్మీకి విదేశాంగ కార్యదర్శీ విక్రం మిస్రీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఉల్లంఘనలపై అలు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పాక్ విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనే వార్తలను ఖండించింది. పాకిస్తాన్ పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తుందని చెప్పుకొచ్చింది. తాము విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు మరో కీలక ఆరోపణలు కూడా చేసింది. భారత్‌ నుంచి కూడా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించింది. కాల్పుల విరమణ అమలులో సమస్యలు ఏర్పడితే చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పాక్‌ పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..