బంగారాన్ని ఇక బటానిల్లా కొనొచ్చు! సీసం నుంచి బంగారం ఉత్పత్తి..
CERN శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో విజయం సాధించారు. లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లోని అధిక-శక్తి ఘర్షణల ద్వారా ఈ విజయం సాధ్యమైంది. ఈ ఆవిష్కరణ వల్ల భవిష్యత్తులో బంగారం ఉత్పత్తి పెరిగి, దాని ధర తగ్గే అవకాశం ఉంది. ఇది బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

ప్రస్తుతం బంగారం ధర భారీగా ఉంది. ఆ ధర చూసి.. బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. బంగారం ధర ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని చాలా మంది ఎందుకు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. కొన్ని రోజుల్లో బంగారాన్ని ఏకంగా బటానిల్లా కొనిపారేయొచ్చు. సరదాగా షాపింగ్‌కు వెళ్లి కేజీల లెక్క గోల్డ్‌ను సొంతం చేసుకోచ్చు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కాదా.. కానీ, ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా నిజమే అంటారు. CERN (European Organization for Nuclear Research) (Conseil Européen pour la Recherche Nucléaire) లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) అని పిలువబడే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌లోని భౌతిక శాస్త్రవేత్తలు, సీసాన్ని బంగారంగా విజయవంతంగా మార్చడంలో శాస్త్రీయ విజయం సాధించారు.
సీస కేంద్రకాల అధిక-శక్తి ఘర్షణల సమయంలో పరిశోధకులు బంగారు కేంద్రకాల ఏర్పాటును గమనించారు. ఆధునిక భౌతిక శాస్త్రం ద్వారా యుగాల నాటి రసవాద ఆకాంక్షను గ్రహించారు. ALICE ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్వహించిన ఈ ప్రయోగాలు బిగ్ బ్యాంగ్ తర్వాత కొంతకాలం ఉన్న ప్రాథమిక శక్తులు, పరిస్థితులపై విలువైన ఇన్‌సైట్స్‌ను అందిస్తాయి. ఫిజికల్ రివ్యూ జర్నల్స్ లో ప్రచురితమైన ఒక నివేదికలో ALICE సహకారం CERN లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ( LHC) లో సీసం బంగారంగా మారడం గమనించారు. ఈ పద్దతిలో మరింత బంగారం ఉత్పత్తి చేసి భారీగా మార్కెట్‌లోకి వదిలితే.. సప్లయ్ పెరిగి, డిమాండ్ తగ్గి, ధర కూడా తగ్గే అవకాశం ఉంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




