Masood Azhar: మసూద్ అజర్‌‌ను అరెస్ట్ చేయండి.. ఆఫ్ఘనిస్తాన్‌కు లేఖ రాసిన పాకిస్తాన్..

|

Sep 14, 2022 | 9:05 AM

Masood Azhar In Afghanistan: మసూద్ అజర్ తమ గడ్డపై లేడని.. అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండవచ్చని పాకిస్తాన్ కొత్త రాగం అందుకుంది. మసూద్ అజార్ ఎక్కుడున్నాడో తమకు తెలియదని పాకిస్తాన్ నిరంతరం వాదిస్తోంది. అయితే మసూద్ అజార్ పాకిస్తాన్ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. జైష్ ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించేందుకు..

Masood Azhar: మసూద్ అజర్‌‌ను అరెస్ట్ చేయండి.. ఆఫ్ఘనిస్తాన్‌కు లేఖ రాసిన పాకిస్తాన్..
Maulana Masood Azhar
Follow us on

పాకిస్తాన్ కొత్త రాగం ఎత్తుకుంది. తన పుట్టలో దాగున్న విష సర్పాన్ని దాచిపెడుతోంది. అంతే కాదు అందరి దృష్టిని డైవర్ట్ చేసేందుకు కొత్తగా ప్లాన్ చేసింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. మసూద్ అజార్ ఆఫ్ఘన్ ప్రావిన్స్‌లోని నంగర్‌హర్, కున్హర్‌లలో ఉండే అవకాశం ఉందని లేఖలో స్పష్టంగా పేర్కొంది. జైషే చీఫ్‌ని కనిపెట్టి అరెస్ట్ చేయాలని.. ఆ తర్వాత పాక్ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొంది. మసూద్‌ అజార్‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ విదేశాంగ శాఖ లేఖ రాయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశంపై అఫ్ఘనిస్తాన్ ఇంతవరకు స్పందించలేదు.

చైనా అడ్డుకుంటుంది..

మసూద్‌ అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో 2019 మే 1న ఐక్యరాజ్యసమితి చేర్చింది. 2008లో భారత పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత అమెరికా జెఎమ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చింది. జెఎమ్‌, మసూద్‌ అజార్‌లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే చైనా ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంది.

పాకిస్తాన్‌పై FATF ఒత్తిడి

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ఒత్తిడి పెంచడంతో పాకిస్తాన్ ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఆ సంస్థ ఉగ్రవాదులపై వెంటనే చర్య తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ఇలా చేయడం ద్వారా ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. FATF నుంచి వచ్చిన ఒత్తిడి ఫలితంగానే పాకిస్తాన్ కొత్త నాటకం మొదలు పెట్టింది. గతంలో కూడా లష్కరే తోయిబా కమాండర్ సాజిద్ మీర్‌పై చర్య తీసుకుంది. 

మసూద్ అజార్ తమ గడ్డపై లేడని, అతడు ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఉండవచ్చని పాకిస్తాన్ కొత్త కథలు చెబుతోంది. మసూద్ అజార్ జాడ లేదని పాకిస్తాన్ నిరంతరం వాదిస్తోంది. అయితే మసూద్ అజార్ పాకిస్తాన్ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో చురుకుగా పోస్టులు పెడుతూనే ఉంటాడు. అంతేకాదు జైష్ సంస్థలో ఉగ్రవాదలును చేర్చుకునే పనిలో బిజీ ఉంటాడు. 

FATF  ఆసియా-పసిఫిక్ గ్రూప్ విడుదల చేసిన తాజా నివేదికలో పాకిస్తాన్‌కు తక్కువ రేటింగ్ ఇచ్చింది. సిడ్నీ కేంద్రంగా FATF పని చేస్తుంది. ఆసియా పసిఫిక్ గ్రూప్ (APG), తాజా రేటింగ్‌లను సెప్టెంబర్ 2న FATF విడుదల చేసింది. FATF అందించే 11 పాయిట్లలో పాకిస్తాన్‌కు కేవలం 1 పాయింట్ మాత్రమే వచ్చింది. ఈ వివరాలను ది డాన్ పత్రిక ప్రచూరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం