ఈ గ్లోబల్ ఛాలెంజ్ పై అంతా కలిసి పోరాడుదాం. ఇండియాకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం

| Edited By: Phani CH

Apr 24, 2021 | 4:39 PM

సెకండ్ కోవిడ్ వేవ్ కేసులతో తల్లడిల్లుతున్న ఇండియాకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ వ్యాప్త సవాల్ పై అంతా కలిసి పోరాడుదామని ట్వీట్ చేశారు.

ఈ గ్లోబల్ ఛాలెంజ్ పై అంతా కలిసి పోరాడుదాం. ఇండియాకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం
Pak Pm Imran Khan
Follow us on

సెకండ్ కోవిడ్ వేవ్ కేసులతో తల్లడిల్లుతున్న ఇండియాకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ వ్యాప్త సవాల్ పై అంతా కలిసి పోరాడుదామని ట్వీట్ చేశారు. ఇది ఉమ్మడిగా జరగాలని పేర్కొన్నారు. ప్రమాదకరమైన కోవిడ్ వేవ్ తో భారత ప్రజలు పోరాటం జరుపుతున్నారని, మా పొరుగు దేశంలో (భారత్) వ్యాప్తి చెందిన పాండమిక్ కారణంగా మరణించినవారి కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నానని ఆయన అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో అంతా సమిష్టిగా ఈ సవాలును ఎదుర్కొందామని ఆయన అన్నారు. అటు-ఇండియాలో శనివారం నాటికి కరోనా కేసులు 3,46,786 కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు సుమారు పాతిక  లక్షలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఇప్పటివరకు 1,89,544 మంది కరోనా రోగులు మృతి చెందినట్టు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద 3 వేలకు పైగాసార్లు  కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు … ఇండియా పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఏమైనా…. ఈ విపత్కర పరిస్థితుల్లో దాయాది దేశం నేను ఉన్నానంటూ పరోక్షంగా అభయ హస్తం ఇస్తోంది.

ఇలా ఉండగా పాకిస్థాన్ కూడా ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. అయితే ఇండియాతో పోలిస్తే తక్కువే. పాక్ లో శుక్రవారం ఒక్కరోజే 144  మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,842 కి చేరింది. ఈ దేశంలో 784,108 కోవిడ్ కేసులు ఉన్నట్టు అంచనా.. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించాలని  పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.  అయితే విపక్షాలతో కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ డ్యూటీలో 4 నెలల గర్భంతో నర్సు , ఉపవాస దీక్ష పాటిస్తూనే రోగులకు సేవలు

Art of a child: టీచర్ చిన్నబుచ్చింది.. అమ్మ ఆలోచించింది.. వాళ్ళు ప్రోత్సహించారు..ఆరేళ్ళ చిన్నారి అద్భుత పెయింటర్ అయింది!