Abdul Khader Khan: తీవ్ర అనారోగ్యంతో మరణించిన పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్

|

Oct 10, 2021 | 1:19 PM

పాకిస్తాన్ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం 85 సంవత్సరాల వయసులో మరణించారు.

Abdul Khader Khan: తీవ్ర అనారోగ్యంతో మరణించిన పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్
Abdul Khadir Khan
Follow us on

Abdul Khader Khan: పాకిస్తాన్ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం 85 సంవత్సరాల వయసులో మరణించారు. డాక్టర్ ఖాన్ పాకిస్తాన్ అణు కార్యక్రమ పితామహుడిగా చెప్పుకుంటారు. పాకిస్తాన్‌ను ముస్లిం ప్రపంచంలో మొదటి అణ్వాయుధ సంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ఆయనది ప్రధాన పాత్ర. పాకిస్తాన్ ప్రజలు ఆయనను హీరోగా చూస్తారు. డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆరోగ్యం శనివారం రాత్రి క్షీణించడం ప్రారంభమైంది. దీని తరువాత, ఆదివారం ఉదయం ఆరు గంటలకు అంబులెన్స్ ద్వారా ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అణు శాస్త్రవేత్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది. అంతేకాకుండా ఆయన అతని ఊపిరితిత్తులలో రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. ప్రముఖ శాస్త్రవేత్త ప్రాణాలను కాపాడటానికి వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ, వారు విజయం సాధించలేదు. ఆయన స్థానిక సమయం ఉదయం 7:04 గంటలకు మరణించారు. ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్లే అబ్దుల్ ఖాదిర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ ఖాన్ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నాలు జరిగాయని పాకిస్థాన్ అంతర్గత మంత్రి షేక్ రషీద్ అన్నారు. ఆయనను ఇస్లామాబాద్‌లోని స్మశానవాటికలో ఖననం చేస్తారు.

భారతదేశంలోని భోపాల్ నగరంలో జననం..

డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ మే 1998 లో పాకిస్తాన్ మొదటి అణు పరీక్ష నిర్వహించినప్పుడు పాకిస్తాన్‌లో రాత్రికిరాత్రే జాతీయ హీరో అయ్యారు. అణు పరీక్షల తరువాత, పాకిస్తాన్ ముస్లిం ప్రపంచంలో ఏకైక అణుశక్తిగా, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏడవ దేశంగా మారింది. డాక్టర్ ఖాన్ 1936 లో భారతదేశంలోని భోపాల్ నగరంలో జన్మించారు. కానీ విభజన తర్వాత, ఖాన్ తన కుటుంబంతో పాకిస్తాన్ వెళ్లారు. డాక్టర్ ఖాన్ కరాచీలోని డీజే సైన్స్ కళాశాల నుండి తన ప్రాథమిక విద్యను పొందారు. ఆ తర్వాత 1961 లో ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లి, జర్మనీ, హాలండ్‌లోని విశ్వవిద్యాలయాల నుండి పీహెచ్‌డీ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ పట్టించుకోలేదని ఆరోపణ.. 

గత నెలలో, డాక్టర్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్, అతని క్యాబినెట్ మంత్రులు ఆరోగ్యం క్షీణించినప్పుడు తనను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ లేదా అతని క్యాబినెట్ సభ్యులు ఎవరూ ఆసుపత్రిలో చికిత్స సమయంలో తన ఆరోగ్యం గురించి అడగలేదని ఆయన ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ అధికారిక అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, డాక్టర్ ఖాన్ కరోనా బారిన పడిన తర్వాత ఆగస్టు 26 న ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ ఆసుపత్రిలో చేరారు. తరువాత, ఆయనను రావల్పిండిలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆయనను అక్కడ నుంచి డిశ్చార్జి చేశారు.

Also Read: Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?

Hugging: కౌగిలించుకోవ‌డం వ‌ల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజ‌నాలు..! మీకు తెలియ‌కుండానే జ‌రిగిపోతాయి..