Pakistan: దేశ భద్రతకు ముప్పు అని పాకిస్తాన్‌లో X నిషేధం.. వారంలో నిషేధం ఎత్తివేయాలన్న కోర్టు

నిజానికి ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పాకిస్తాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఓటింగ్ రోజున పాకిస్థాన్‌లో రోజంతా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశింది. అయితే ఎన్నికల తర్వాత చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మళ్లీ మునుపటిలా పని చేయడం ప్రారంభించాయి. అయితే X వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు.

Pakistan: దేశ భద్రతకు ముప్పు అని పాకిస్తాన్‌లో X నిషేధం.. వారంలో నిషేధం ఎత్తివేయాలన్న కోర్టు
Pakistan Ban Twitter X
Follow us

|

Updated on: Apr 17, 2024 | 8:51 PM

పాకిస్తాన్ లో ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)పై నిషేధం విధించింది. భద్రతా సమస్యలను  కారణంగా చూపించి ఫిబ్రవరిలోనే X ని నిషేధించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే నేడు పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఎలోన్ మస్క్ X కి సంబంధించిన సిబ్బంది కోర్టు మెట్లు ఎక్కింది. మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌పై నిషేధాన్ని రద్దు చేయాలని యాజమాన్యం పాకిస్థాన్ సింధ్ హైకోర్టు (ఎస్‌హెచ్‌సి) కోర్టుని ఆశ్రయించింది. దీంతో హై కోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక ప్రకారం ఒక వారంలోగా నిషేధాన్ని ఎత్తివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

భద్రతా సమస్యలను కారణంగా చూపించిన పాకిస్థాన్ ప్రభుత్వం

పాకిస్తాన్ ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం X ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగానికి గురవుతుందని.. ఇందుకు సంబంధించిన జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో X విఫలమైందని పేర్కొంది. అందుకనే X (Twitter) పై నిషేధం తప్పనిసరి అయిందని వెల్లడించింది. అయితే  ఈ విషయంపై X ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్‌లో  ఫిబ్రవరి 2024 నుంచి పని చేయని ‘X’

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చాలా మంది పాకిస్తానీ వినియోగదారులు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా Xని ఉపయోగించలేక పోతున్నామని వెల్లడించారు. అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2024 నుంచి X వినియోగంలో లేదు.  పాకిస్థాన్‌లో విధించిన నిషేధం కారణంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ చాలా కాలం పాటు నిలిపివేయబడిందని నిర్ధారిస్తోంది. చాలా మంది వినియోగదారులు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ద్వారా X పై నిషేధాన్ని కూడా ధృవీకరించారు.

అసలు విషయం ఏమిటంటే

నిజానికి ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పాకిస్తాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఓటింగ్ రోజున పాకిస్థాన్‌లో రోజంతా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశింది. అయితే ఎన్నికల తర్వాత చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మళ్లీ మునుపటిలా పని చేయడం ప్రారంభించాయి. అయితే X వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు.

అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్‌లోని సింధ్ హైకోర్టు X ప్లాట్‌ఫారమ్ సేవను పునరుద్ధరించాలని టెలికాం అథారిటీని ఆదేశించింది. అయినప్పటికీ  X సేవను ప్రభుత్వం పునరుద్ధరించలేదు. ఇప్పుడు ప్రభుత్వం X దేశ భద్రతకు ముప్పు అని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మరి దీనిపై X యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..