Samantha: సమంత లగ్జరీ కార్ల కలెక్షన్ చూశారా..? ఆస్తులు ఎంతంటే..

మయోసైటిస్ కారణంగా సామ్ చాలా నెలలుగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి మూవీస్ లోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఏప్రిల్ 28న సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. దశాబ్దంపాటు అగ్రకథానాయికగా కొనసాగుతుంది.

Samantha: సమంత లగ్జరీ కార్ల కలెక్షన్ చూశారా..? ఆస్తులు ఎంతంటే..
Samantha
Follow us

|

Updated on: Apr 30, 2024 | 9:52 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత చాలా స్పెషల్. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన సామ్.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సామ్ చాలా నెలలుగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి మూవీస్ లోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఏప్రిల్ 28న సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. దశాబ్దంపాటు అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ఇక సామ్ నికర విలువ రూ. 115 కోట్లు అని సమాచారం.

అలాగే ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. దక్షిణాదిలో నయనతార తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఆమెనే. నటనతో పాటు, ఆమె ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రచార కార్యక్రమాల నుండి కూడా సంపాదిస్తుంది. సామ్ వద్ద రూ. 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ నుంచి పోర్షే కేమాన్ జిటిఎస్ వరకు లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది.

సమంత కార్ కలెక్షన్..

  1. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ – రూ 2.26 కోట్లు
  2. పోర్షే కేమాన్ GTS – రూ 1.46 కోట్లు
  3. జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ – రూ. 72 లక్షలు
  4. Mercedes Benz G63 AMG – రూ. 3.30 కోట్లు
  5. ఆడి క్యూ7 — రూ. 87 లక్షలు
  6. BMW 7 సిరీస్- రూ. 1.70 కోట్లు

సమంత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సూపర్‌ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. ముంబైలో 15 కోట్ల రూపాయల విలువైన 3BHK ప్లాట్ ఉంది. ఇది సముద్రానికి దగ్గరగా అందమైన ప్రదేశంలో ఉంది. ఆమె వార్డ్‌రోబ్‌లో లూయిస్ విట్టన్, గూచీ, చానెల్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లు ఉన్నాయి. సామ్ ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఈ ఫౌండేషన్ ద్వారా మహిళలకు, చిన్నారులకు సాయం అందిస్తుంది. మిస్ ఇండియా 2016 మొదటి రన్నరప్ అయిన సుశ్రుతి కృష్ణతో సమంత 2020లో సాకి అనే తన ఫ్యాషన్ లేబుల్‌ని ప్రారంభించింది. అలాగే పలు వ్యాపారాల్లో పెట్టుపడులు పెట్టింది.

Source : Siasat..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.