Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. ఆస్పత్రి పై కప్పులో 500 మృత దేహాలు.. శరీర భాగాలు మాయం..

|

Oct 15, 2022 | 12:02 PM

ఈ మృతదేహాల నుంచి అవయవాలను అక్రమంగా తరలించారని.. లేదంటే వైద్య పరీక్షల కోసం మృతదేహాల అవయవాలను విడదీసి ఉండవచ్చని భావిస్తున్నారు.

Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. ఆస్పత్రి పై కప్పులో 500 మృత దేహాలు.. శరీర భాగాలు మాయం..
Nishtar Hospital In Pak
Follow us on

పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లోని ఓ ఆసుపత్రి పైకప్పుపై మృతదేహాల కుప్ప కనిపించింది. ఈ ఘటన పంజాబ్ నిష్టర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే అక్కడ మృతదేహాలలో చాలా భాగాలు కూడా కనిపించడం లేదు. చాలా మృతదేహాలు ఛిద్రం కాగా, చాలా మృతదేహాల నుంచి ఛాతీలు బయటపడ్డాయి. మృత దేహాల నుంచి గుండె, ఇతర అవయవాలు బయటకు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి పైకప్పు నుండి బయటపడిన మృతదేహాల సంఖ్య 500 వరకు ఉంటుందని తెలుస్తోంది.

అయితే, ఇవి ఎవరి మృతదేహాలు.. ఆసుపత్రి పైకప్పుపై ఇంత భారీ సంఖ్యలో మృతదేహాలు ఎక్కడ నుండి వచ్చాయి.. వంటి అనేక అనుమాలు కలుగుతున్న్నాయి. వీటికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ మృతదేహాల నుంచి అవయవాలను అక్రమంగా తరలించారని.. లేదంటే వైద్య పరీక్షల కోసం మృతదేహాల అవయవాలను విడదీసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎవరి మృతదేహాలు, ఎక్కడి నుంచి వచ్చాయి?
దీనికి సంబంధించిన వీడియోను పర్వేజ్ ఇక్బాల్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. పంజాబ్ ప్రావిన్స్‌లోని నిష్టర్ హాస్పిటల్ టెర్రస్ నుండి 500 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు . చాలా మృతదేహాల ఛాతీలు బయటపడ్డాయి. వాటి పెద్ద సైజు ప్యాంటును బట్టి.. ఈ మృతులు బలూచ్ కమ్యూనిటీకి చెందినట్లు అనుమానిస్తున్నారు.  అయితే స్పష్టమైన సమాచారం కోసం అధికారాలు రంగంలోకి దిగారు.

 

ఆరుగురు అధికారుల బృందం 3 రోజుల్లో నివేదికను అందజేస్తుంది
గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసిన తర్వాత, ప్రావిన్స్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు చౌదరి జమాన్ గుర్జార్ ఆసుపత్రిని సందర్శించారు. మృత దేహాలన్నింటికి దహన సంస్కారాలు నిర్వహించాలని, దీనిపై విచారణ జరపాలని పోలీసు అధికారులను సీఎం సలహాదారు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై సీఎం చౌదరి పర్వేజ్‌ కూడా విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణకు ఆరుగురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మూడు రోజుల్లోగా విచారణ నివేదికను అందజేయాలని ఆదేశించారు.

మరన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..