జీతాలు ఇవ్వడం లేదు… వలసదారుల వ్యధ!

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2019 | 7:42 PM

ఉపాధి కోసం యుఏఈకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన పలువురు భారతీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సొంత ఊళ్లలో ఉపాధి లేక దేశ వ్యాప్తంగా సుమారు 300 మంది యుఏఈ లో కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కంపెనీ యాజమాన్యం మారడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. జీతాలు లేక, అక్కడ గదుల్లో ఉండలేక నరకయాతన అనుభవించారు. చివరికి స్వస్థలాలకు చేరుకోవాలన్నా అక్కడ కంపెనీ సహకారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే తాము ఐదు నెలలుగా పని చేస్తున్నా […]

జీతాలు ఇవ్వడం లేదు... వలసదారుల వ్యధ!
Follow us on

ఉపాధి కోసం యుఏఈకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన పలువురు భారతీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సొంత ఊళ్లలో ఉపాధి లేక దేశ వ్యాప్తంగా సుమారు 300 మంది యుఏఈ లో కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కంపెనీ యాజమాన్యం మారడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. జీతాలు లేక, అక్కడ గదుల్లో ఉండలేక నరకయాతన అనుభవించారు. చివరికి స్వస్థలాలకు చేరుకోవాలన్నా అక్కడ కంపెనీ సహకారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే తాము ఐదు నెలలుగా పని చేస్తున్నా జీతాలు ఇవ్వడం లేదని వారు మీడియాకు ఫోన్లో తెలిపారు. స్వదేశానికి వెళ్లడానికి పాసుపోర్టు కావాలని కోరితే కంపెనీకి రూ.70వేలు చెల్లించి వెళ్లాలని చెబుతున్నారని బాధితులు తెలిపారు. వారి ఇబ్బందులుపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన భారత ప్రభుత్వం ఇండియన్‍ ఎంబసీపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సౌదిలో ఉన్న ఎంబసీ అధికారులు కార్మికుల సమస్యలను సౌది ప్రభుత్వానికి నివేదించారు.