Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురుకి గాయాలు.. వెయ్యిమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

|

Mar 30, 2021 | 7:09 AM

Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. వెస్ట్ జావా ప్రావిన్సులోని అతిపెద్ద ఆయిల్ రిఫైన‌రీ.. బ‌లంగ‌న్ రిఫైన‌రీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయ‌ప‌డ్డారు..

Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురుకి గాయాలు.. వెయ్యిమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
Indonesia Fire Accident
Follow us on

Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. వెస్ట్ జావా ప్రావిన్సులోని అతిపెద్ద ఆయిల్ రిఫైన‌రీ.. బ‌లంగ‌న్ రిఫైన‌రీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. అలాగే.. ప్రమాద‌స్థలానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న సుమారు 1000 మంది స్థానికుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

ఈ ఆయిల్ రిఫైనరీ ఇందిలోనేషియాలోనే అతి పెద్దది. అగ్నిప్రమాదానికి ముందు అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఈ రిఫైనరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెర్టామినా నిర్వహిస్తోంది. ప్రమాదం కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్రిమాపక దళాలు మంటలు అదుపు చేశాయి.

ఈ ప్రమాదంపై స్పందించిన స్థానికుడు .. ప్రమాదానికి ముందు భారీ శబ్దం వినిపించిందని, తాను దానిని హరికేన్ అనుకున్నానని చెప్పారు. తీరా బయటకు వచ్చి చూస్తే మంటలు భారీగా ఎగసిపడుతున్నాయని పేర్కొన్నాడు. తొలుత స్టోరేజీ ట్యాంకులో మంటలు అంటుకోగా, ఆ తర్వాత కంటైనర్స్‌కు పాకినట్టు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక విపత్తు సంస్థ తెలిపింది. మరో 15 మంది గాయపడ్డారని, ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

 

Also Read: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర పెరిగిందంటే..?

 ఈ రోజు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?