Kim Jong Un: కిమ్ మామ సంచలన నిర్ణయం.. టైట్ జీన్స్, హెయిర్ కలర్ వేస్తే జైలుకే..

|

May 11, 2022 | 6:59 AM

Kim Jong Un: తమ ప్రజలకు ఎప్పుడూ వింత రూల్స్ పెట్టే ఉత్తర కొరియా.. మరో సారి కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ సారి పాశ్చాత్య సంస్కృతిని(Western Culture) తమ దేశంలో కట్టడి చేసేందుకు వీటిని ప్రవేశపెడుతోంది.

Kim Jong Un: కిమ్ మామ సంచలన నిర్ణయం.. టైట్ జీన్స్, హెయిర్ కలర్ వేస్తే జైలుకే..
Kim Jong Un
Follow us on

Kim Jong Un: తమ ప్రజలకు ఎప్పుడూ వింత రూల్స్ పెట్టే ఉత్తర కొరియా.. మరో సారి కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ సారి పాశ్చాత్య సంస్కృతిని(Western Culture) తమ దేశంలో కట్టడి చేసేందుకు వీటిని ప్రవేశపెడుతోంది. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు మహిళలను లక్ష్యంగా చేసుకుని రూల్స్ తెస్తున్నట్లు అక్కడి మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. టైట్​ జీన్స్(Tight Jeans)​, హెయిర్ కలరింగ్, అసభ్యకర రాతలుండే బట్టలు ధరించడం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇలాంటి వేషధారణతో రోడ్లపై కనిపిస్తే పెట్రోలింగ్​ అధికారులు పోలీస్​ స్టేషన్​కు తరలిస్తున్నారు. అనంతరం నేరాన్ని ఒప్పుకుని.. తిరిగి అలాంటి దుస్తులు ధరించబోమని హామీ ఇచ్చిన వారిని మాత్రమే విడుదల చేస్తున్నారు.

గత మేలోనే నార్త్ కొరియా జీన్స్​, హెయిర్​ స్టైల్స్​ను నిషేధించింది. ఈ విదేశీ ఫ్యాషన్ అలవాట్లను ‘ప్రమాదకరమైన విషం’గా ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్​ ఉన్‌ అభివర్ణించారు. ఆయన ప్రకటన అనంతరం ఈ ఆంక్షల అమలుపై అధికారులు మరింత శ్రద్ధపెట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యాత్​ లీగ్​ వీటిని ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు సమావేశాలను నిర్వహిస్తోంది. అత్యంత తీవ్రమైన సందర్భాల్లో నిబంధనల్ని ఉల్లంఘించినవారి పేరు, చిరునామాను లౌడ్​స్పీకర్లలో ప్రచారం చేస్తామని యూత్​లీగ్​ సభ్యులు తెలిపారు. ఇన్ని నిబంధనలు విధించినా యువత విదేశీ సినిమాలు, దుస్తులు ధరించడంలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు.

నార్త్ కొరియా అణు నిరాయుధీకరణ ప్రారంభిస్తే.. ఆ దేశ అర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్ హామీ ఇచ్చారు. ఉత్తర కొరియా సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి సిద్ధమని మంగళవారం తెలిపారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చేస్తే ప్రోత్సాహకాలను అందిస్తామని గతంలోనూ ప్రకటించారు. కానీ కిమ్‌ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలతో దక్షిణ కొరియాతో పాటు ఈశాన్య ఆసియాకు ముప్పు ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి..

Train Ticket: ప్రయాణ సమయంలో టికెట్ పోగొట్టుకున్నారా.. డోన్ట్ వర్రీ వెంటనే ఇలా చేయండి..

punjab blast update: ఇంటెలిజెన్స్‌ కార్యాలయంపై రాకెట్‌ దాడి.. బయటపడ్డ పాక్ ప్రమేయం..!