కిమ్ ‘మిస్సైళ్లు’ మళ్లీ పేలాయి

ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా మిలిటరీ ఆరోపణలు చేసింది. ప్యోంగ్యాన్ ప్రాంతంలోని సినోరిలో తూర్పు దిశగా ఈ రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి తెలిపారు. ఈ ఉదయం 20నిమిషాల వ్యవధిలో వీటిని ప్రయోగించినట్లు ఆయన చెప్పారు. వారం వ్యవధిలో ఆ దేశం మిస్సైల్‌ను ప్రయోగించడం ఇది రెండోసారని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ విషయాన్ని ఉత్తర కొరియా మీడియా కూడా ధృవీకరించింది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ […]

కిమ్ ‘మిస్సైళ్లు’ మళ్లీ పేలాయి

Edited By:

Updated on: May 09, 2019 | 4:50 PM

ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా మిలిటరీ ఆరోపణలు చేసింది. ప్యోంగ్యాన్ ప్రాంతంలోని సినోరిలో తూర్పు దిశగా ఈ రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి తెలిపారు. ఈ ఉదయం 20నిమిషాల వ్యవధిలో వీటిని ప్రయోగించినట్లు ఆయన చెప్పారు. వారం వ్యవధిలో ఆ దేశం మిస్సైల్‌ను ప్రయోగించడం ఇది రెండోసారని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ విషయాన్ని ఉత్తర కొరియా మీడియా కూడా ధృవీకరించింది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సమక్షంలో ఈ ప్రయోగం జరిగిందని అక్కడి మీడియా తెలిపింది. మిలిటరీ డ్రిల్లింగ్‌లో భాగంగానే ఈ క్షిపణి ప్రయోగం జరిగిందని ప్రకటించింది.