Dr Muhammad Yunus: బంగ్లాదేశ్‌ నోబెల్‌ గ్రహీతకు 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఏందుకంటే

|

Jan 02, 2024 | 8:06 AM

బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌ (83)కు కోర్టు సోమవారం (జనవరి 1) ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు గారే ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్‌ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్‌ మరీనా సుల్తానా తీర్పు..

Dr Muhammad Yunus: బంగ్లాదేశ్‌ నోబెల్‌ గ్రహీతకు 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఏందుకంటే
Dr Muhammad Yunus
Follow us on

బంగ్లాదేశ్‌, జనవరి 2: బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌ (83)కు కోర్టు సోమవారం (జనవరి 1) ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు గారే ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్‌ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్‌ మరీనా సుల్తానా తీర్పు సమయంలో పేర్కొన్నారు. గ్రామీణ టెలికాం ఛైర్మన్‌గా చట్టాన్ని ఉల్లంఘించినందుకుగానూ అతని కంపెనీకి చెందిన మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లతో పాటు యూనస్‌కు ఆరు నెలల సాధారణ లేదా కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నలుగురిపై కార్మిక సంక్షేమ నిది సమకూర్చలేదనే ఆరోపణలు వచ్చాయి. కార్మిక చట్టాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. దీంతో జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి 25 వేల బంగ్లా టాకాల చొప్పున జరిమానా కోర్టు విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలైమైతే మరో 10 రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. తీర్పు అనంతరం యూన్‌స్‌తోపాటు మిగతా ముగ్గురు బెయిల్ కోసం ప్రయత్నించారు. 5 వేల విలువైన టాకా బాండ్‌ సమర్పించగా న్యాయమూర్తి నెల రోజులపాటు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే వీలుంటుంది.

బంగ్లాదేశ్‌లో జనవరి 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ ప్రేరేపితమనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌ పేదరిక వ్యతిరేక ప్రచారానికి గానూ 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నాడు. యూనుస్ కార్మిక చట్టం, నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు 2008లో అధికారంలోకి వచ్చిన షేర్ హసీనా ప్రభుత్వం ఈయన కేసులపై దర్యాప్రు ప్రారంభించింది. 2011లో గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించింది.

యూనస్ గ్రామీణ టెలికాంతోపాటు అతను స్థాపించిన 50కిపైగా సామాజిక వ్యాపార సంస్థల నుంచి లాభం పొందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. వాటి ద్వారా తాను వ్యక్తిగత ప్రయోజనం పొందడం లేదని మీడియాకు తెలిపారు. అవమానించడం, వేధించడం లక్ష్యంగా ఆయనపై తప్పుడు కేసులు బనాయించారని యూసప్‌ లాయర్ అన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వంతో యూసఫ్‌కు మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. 2008లో అధికారంలోకి వచ్చిన తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అతనిపై వరుస దర్యాప్తులను ప్రారంభించింది. 2011లో గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్‌ పదవి నుంచి ఆయనను తొలగించింది కూడా.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.