
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది. భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సమావేశమైన UNSC పాక్‌పైనే ప్రశ్నల వర్షం కురిపించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేసిన వాదనను తిరస్కరించడమే కాకుండా.. పహల్గామ్ ఉగ్రదాడి వెనక లష్కరే టెర్రరిస్టుల ప్రమేయంపై పాక్ ప్రతినిధిని గట్టిగా నిలదీసింది UNSC. ఉగ్రదాడిని ఖండిస్తూ, బాధ్యులను శిక్షించాలంటూ మండలిలో ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి సభ్యదేశాలు. మతం ఆధారంగా టూరిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర ప్రయోగాలు, పాక్ మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలను తప్పుబట్టింది. సమస్యలను భారత్‌తో ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని పాక్‌ను సూచించింది.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి.. పౌరులను టార్గెట్ చేయడం సహించేమని తేల్చి చెప్పింది. భారత్-పాకిస్తాన్ యుద్ధానికి వెళ్లకూడదని సమితి సలహా ఇచ్చింది. యుద్ధనివారణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడానికైనా.. తాము సిద్ధంగా ఉన్నామని సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆఫర్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించడంపైనే రెండుదేశాలు ఫోకస్ చేయాలంటూ సూచించింది.
UN Security Council members raised tough questions for Pakistan at its informal session today. They refused to accept the “false flag” narrative and asked whether LeT was likely to be involved. There was broad condemnation of the terrorist attack and recognition of the need for… pic.twitter.com/3voUps65PR
— ANI (@ANI) May 6, 2025