WHO Warning: గత రెండేళ్ల నుంచి కరోనా (Corona) మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతం చేస్తోంది. కరోనా బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఇక మొదటి, రెండు వేవ్‌లు వ్యాపించగా, ఇప్పుడు థర్డ్‌వేవ్ కొనసాగుతోంది. ఇది కూడా ముగింపులో ఉంది. ఈ వేవ్‌లో పెద్దగా కేసులు నమోదు కాలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనాతో పాటు కొత్త కొత్త వేరియంట్లు వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ తర్వాత సౌతాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ మరింత ఆందోళనకు గురి చేసింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఈ ఒమిక్రాన్ వ్యాపించింది. అయినా పెద్దగా ప్రమాదం లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. తదుపరి వచ్చే వేరియంట్ ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. వచ్చే వేవ్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముందస్తుగా సూచిస్తోంది.
ప్రస్తుతం వ్యాప్తిస్తున్న వేరియంట్ల కంటే వచ్చే వేరియంట్‌ను ఎంతో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. భవిష్యత్తులో వచ్చే వేరియంట్లతో ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కోవిడ్ టీకాలు వేస్తున్నారు. టీకాల వల్ల కరోనా వ్యాప్తి పెద్దగా ఉండదని అనుకున్నప్పటికీ.. వైరస్ ఈ వ్యాక్సిన్లకు లొంగడం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్స్ తీసుకున్న వారు కూడా థర్డ్‌వేవ్‌లో కూడా వైరస్ బారిన పడ్డారు.
ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదని, భవిష్యత్తులో వైరస్‌లు పుట్టుకువచ్చే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. భవిష్యత్తులో వెలుగు చూసే వైరస్‌లు మరింత వ్యాపించే సామర్థ్యం కలిగి ఉంటాయని స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో పుట్టుకువచ్చే వేరియంట్లకు అవకాశం ఇవ్వకుండా ముందు నుంచే కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది డబ్ల్యూహెచ్‌వో.
ఈ వేరియంట్ల వల్ల రక్షించుకునేందుకు కోవిడ్ టీకాలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తోంది. భవిష్యత్తులు పరిస్థితి మరింత దారుణంగా ఉండకూడదని అనుకుంటున్నాము.. వైరస్ వ్యాప్తిని తగ్గించాలని అనుకుంటున్నాము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 టెక్నికల్ చీఫ్ మారియా వెవ్ కెర్ఖోవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి: