Wedding Video: సోషల్ మీడియా లో జంతువుల వీడియోలతో పాటు పెళ్లిళ్ల వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. మరి ఇప్పుడు ఓ వీడియో పెంపుడు కుక్క.. తమ యజమాని పెళ్ళిలో చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వధూవరులిద్దరూ పెళ్లి రోజున డ్యాన్స్ చేశారు. అప్పుడు ఆ దంపతుల మధ్యకు కుక్క వెళ్లి అంతరాయం కలిగింది. ఈ వీడియో ఇప్పటికే 71,000 మంది వ్యూస్ ని సొంతం చేసుకుంది.
వివాహం అనంతరం కొత్త జంట డ్యాన్స్ చేస్తున్నారు. వరుడు.. బ్లాక్ అండ్ వైట్ సూట్ లో, వధువు తెల్లటి గౌన్ తో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. ఒకరి చేయిని ఒకరు పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న సమయంలో సడెన్ గా ఓ కుక్క వారి మధ్యకు చేరుకుంది. అలా వారిద్దరిమధ్యకు కుక్క వచ్చిన వీడియో భలే ఫన్నీగా ఉందంటూ ప్రపోజల్స్ & వెడ్డింగ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేశాసారు. ఈ వీడియో కి కొంతమంది నెటిజన్లు.. పెళ్లిలో పసిపిల్లల సందడి ఎలా బాగుంటుందో.. అలాగే కుక్క కూడా పసి పిల్ల వంటిదే.. దాని అల్లరి బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: అంత త్యాగం అవసరం లేదు.. ఈ పని చేయండి చాలంటూ వైసీపీ ఎంపీలకు పవన్ చురకలు..