Baby Ghost Shark: శాస్త్రజ్ఞుల కంట పడిన అరుదైన దెయ్యం షార్క్ చేప.. పరిశోధన చేయాల్సి ఉందన్న సైంటిస్టులు

|

Feb 18, 2022 | 4:29 PM

Baby Ghost Shark: ఆస్ట్రేలియా(Australia) ఖండంలోని అనేక ప్రాంతాల్లో తరచుగా పిల్లలు పాడుకునే పాటల్లో తరచుగా వినిపించే పదం.. దెయ్యం చేప(Ghost Shark).. ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు..

Baby Ghost Shark: శాస్త్రజ్ఞుల కంట పడిన అరుదైన దెయ్యం షార్క్ చేప.. పరిశోధన చేయాల్సి ఉందన్న సైంటిస్టులు
Baby Ghost Shark
Follow us on

Baby Ghost Shark: ఆస్ట్రేలియా(Australia) ఖండంలోని అనేక ప్రాంతాల్లో తరచుగా పిల్లలు పాడుకునే పాటల్లో తరచుగా వినిపించే పదం.. దెయ్యం చేప(Ghost Shark).. ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఈ ఘోస్ట్ షార్క్‌లను చిమెరాస్(Chimaeras) అని కూడా పిలుస్తారు. సముద్రాల్లో ఉండే అనేక రకాల జీవుల్లో దెయ్యం చేప కూడా ఒకటి. నిజానికి ఇదోరకమైన షార్క్‌ చేప. దీనిని సైంటిస్టులు న్యూజిలాండ్ లోని తూర్పు సముద్ర తీరంలో కనిపెట్టారు. ఇది సముద్రాల్లో అత్యంత లోతున కనిపించే చేప. ఈ చేపలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. వీటిని దెయ్యం చేప అని పిలవడానికి ఓ కారణం ఉంది. వీటి శరీరం లోపలి భాగాలు బయటకు కనిపిస్తాయి. చూడటానికి ఇవి భయంకరంగా ఉంటాయి. అందుకే వీటిని అలా పిలుస్తారు. ఈ సముద్ర జీవుల గురించి పెద్దగా తెలియదు ఎందుకంటే అవి సాధారణంగా 6,000 అడుగుల (1,829 మీటర్లు) లోతులో నివసిస్తాయి. అలాగే “ఈ చేపలు రహస్యంగా తిరుగుతూ ఉంటాయి. వీలైనంతవరకూ బయటి ప్రపంచంలోకి రావు. అందుకే వీటిని కనిపెట్టడం చాలా కష్టం. పనిగట్టుకొని వెళ్లి వెతికినా కనిపించవని పరిశోధకులు చెబుతున్నారు.

“ఇలాంటి చేపలపైన మరింత పరిశోధన జరగాలి అంటున్నారు పరిశోధకులు. వీటిలో పిల్ల చేపలు, పెద్ద చేపలూ వేర్వేరు ఆహారాలు తింటాయట. వాటి అలవాట్లు కూడా వేర్వేరుగా ఉంటాయట.. వీటి ఆకారం, రంగు కూడా పిల్ల చేపలు ఒకలా, పెద్దవి మరోలా ఉంటాయట. తాజాగా కనిపించిన చేప వాటి గురించి, వాటి జీవన విధానం గురించి మరింతగా తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుందంటున్నారు. అయితే ఇప్పుడు కనిపించిన దెయ్యం షార్క్ చేపను 1.2 కిలోమీటర్ల (0.75 మైలు) లోతు నుండి పట్టుకున్నామని ఫినుచీ చెప్పారు. బేబీ దెయ్యం షార్క్ ఫోటోలు తెల్లటి తోక, నల్లని కళ్లతో, పారదర్శక చర్మంతో, నల్లటి రెక్కలను కలిగి ఉంది. ఈ షార్క్ చేప ఏ జాతికి చెందిందో అప్పుడే చెప్పలేమంటున్నారు సైంటిస్టులు. అది తెలుసుకునేందుకు జెనెటిక్ ఎనాలసిస్ జరపాల్సి ఉంటుందన్నారు.

Also Read:

దేశ చరిత్రలో తొలిసారి 38 మందికి మరణశిక్ష.. వీడియో

 పుష్ప పాటలకు స్టెప్పులేసిన క్రికెటర్‌ చాహల్‌ భార్య.. ఫిదా అవుతోన్న నెటిజన్లు. వైరల్‌ వీడియో..